Niharika Konidela: మంచు హీరోకి హీరోయిన్ గా మెగా డాటర్... షాక్ అవుతున్న ఫ్యాన్స్

Manchu Manoj: మంచు ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి చాలా తేడాలు ఉన్నాయి అంటూ.. ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విభేదాలు అన్ని ఆ తరంతోనే ఆగిపోయినట్టు కనిపిస్తోంది.. ప్రస్తుత తరం వారు ఒకరితో ఒకరు మంచి స్నేహితులు గా కలిసి ఉండటమే కాకుండా కలిసి సినిమాలో కూడా చెయ్యడానికి సిద్ధమైపోయారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 05:46 PM IST
Niharika Konidela: మంచు హీరోకి హీరోయిన్ గా మెగా డాటర్... షాక్ అవుతున్న ఫ్యాన్స్

What The Fish: దొంగ దొంగది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంచు హీరో మంచు మనోజ్. మంచు ఫ్యామిలీకి డిఫరెంట్ గా విమర్శలకు చాలా దూరంగా ఉంటారు మనోజ్. అందుకే మంచి ఫ్యామిలీ అంటే పడని వారు కూడా మనోజ్ ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య ఈ హీరో సినిమాలకు గత కొన్ని సంవత్సరాలలో దూరమయ్యారు.

దాదాపు 6 సంవత్సరాలు మనోజ్ ఏ సినిమాలో కూడా కనిపించలేదు.‌ ఇక ఇప్పుడు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించాడు ఈ హీరో. అంతేకాదు బుల్లితెర పైన కూడా ఉస్తాద్ అనే షోలో హోస్ట్ గా చేస్తూ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మంచు మనోజ్. 

ఇక కొన్ని నెలల క్రితం ‘వాట్ ది ఫిష్’ అనే సరికొత్త టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశాడు.  ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కథ గురించి ఈ చిత్రంలో నటించే వారి గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

అయితే ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది అని మాత్రం అర్థమవుతుంది. విశాల్ అండ్ సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాని
కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర చేస్తుండగా తాజాగా ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర చేస్తున్న నటి గురించి ఈరోజు ప్రకటన ఇచ్చారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun 🎬 (@afilmbyv)

ఈరోజు మెగా డాటర్ నిహారిక పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాలో నిహారిక కొణిదెల నటిస్తున్నట్టు ప్రకటించి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సినిమా యూనిట్.

కాగా ఈ సినిమాలో నిహారిక హీరోయిన్ పాత్రలో కనిపిస్తుందా లేదా కేవలం ముఖ్యపాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సిన విషయం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నిహారిక మెరిసేటి షార్ట్ డ్రెస్ లో అదరగొడుతుంది. ఈ నేపథ్యంలో మెగా డాటర్ ఇలా మంచి ఫ్యామిలీ సినిమాలో చేస్తూ ఉండగా అభిమానులు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీకి మధ్య ఏమన్నా విభేదాలు ఉన్న అవి ఆ తరంతోనే ముగిసిపోయాయని ..ఇప్పుడు తరం వారు కలిసి ఉంటున్నారని కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News