Director Shankar: డైరెక్టర్ శంకర్‌పై Non-bailable Warrant జారీ చేసిన కోర్టు, ముదురుతున్న వివాదం

Non-bailable Warrant Issued Against Director Shankar: ప్రముఖ రచయిత అరుణ్ తమిళ్ నందన్ చెన్నై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దర్శకుడు శంకర్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరుకాని కారణంగా ఆయనపనై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 31, 2021, 06:05 PM IST
  • కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఓ వివాదంలో చిక్కుకున్నాడు
  • తన కథను కాపీ కొట్టి తీసిన సినిమా రోబో అని రచయిత ఫిర్యాదు
  • తాజాగా దర్శకుడు శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
Director Shankar: డైరెక్టర్ శంకర్‌పై Non-bailable Warrant జారీ చేసిన కోర్టు, ముదురుతున్న వివాదం

Non-bailable Warrant Issued Against Director Shankar: కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాది డైరెక్టర్ శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రోబో సినిమా అనేది తన కథను కాపీ కొట్టి తీసిన సినిమా అని కొన్నేళ్ల కిందట ప్రముఖ రచయిత అరుణ్ తమిళ్ నందన్ చెన్నై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దర్శకుడు శంకర్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరుకాని కారణంగా ఆయనపనై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

‘జిగుబా’ అనే కథను తాను రచించినట్లు కొన్నేళ్ల కిందట కోలీవుడ్(Kollywood) రచయిత తమిళ్ నందన్ ఫిర్యాదు చేశాడు. ఆ కథను కాపీ కొట్టి, డైరెక్టర్ శంకర్ యంథిరన్(Robo Movie) మూవీ తీశారని కాపీ రైట్ యాక్ట్ కింద అరూర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తాను రాసిన జిగుబా కథ 1996లో ఒక తమిళ మేగజైన్‌లో ప్రచురణ కాగా, 2007లో నవలగా తీసుకొచ్చినట్లు ఆయన వాదిస్తున్నాడు.

Also Read: Major Movie Release Date: అడవి శేషు మేజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mahesh Babu

కాగా, తన కథను కాపీ కొట్టి దర్శకడు శంకర్(Director Shankar).. సూపర్ స్టార్ రజనీకాంత్, నటి ఐశ్వర్యరాయ్ జంటగా రోబో అనే సినిమాను తెరకెక్కించారని తమిళ్ నందర్ ఆరోపించాడు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా దర్శకుడు శంకర్‌ను కోర్టు పలుమార్లు ఆదేశించింది. ఆయన నుంచి సమాధానం లేకపోవడం, విచారణకు హాజరుకాని క్రమంలో శంకర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసింది.

Also Read: Prabhas with Siddharth Anand: మరో పాన్ ఇండియా మూవీకు సిద్ధమౌతున్న ప్రభాస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News