Just a Minute: "జస్ట్ ఎ మినిట్ "వాలెంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కోసం సూపర్ మెలోడీ..!

Valentines Day: ప్రేమికుల రోజు వచ్చేసింది. అందరూ ఎంతో ప్రేమగా జరుపుకునే ఈ రోజు సినీ ప్రేక్షకుల కోసం ఒక లవ్ సాంగ్ కూడా వచ్చేసింది.. మరి ఆ సాంగ్ గురించి వివరాలు చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 09:06 AM IST
Just a Minute: "జస్ట్ ఎ మినిట్ "వాలెంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కోసం సూపర్ మెలోడీ..!

Just a Minute:

ప్రేమ పాటలు ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టవు. అంతేకాకుండా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. అదే రూట్ ఫాలో అవుతూ జస్ట్ ఎ మినిట్ అనే సాంగ్ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలయింది. 

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- "జస్ట్ ఎ మినిట్ ". పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని  రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట సూపర్ సక్సెస్ సాధించగా ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ ‘ మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని అందరూ మెచ్చుకున్నారు.  గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్  గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది.. అలానే రాంబాబు గోసాల గారి సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత ఈ చిత్రం నిర్మాత మాట్లాడుతూ “ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా జస్ట్ ఎ మినిట్  పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము” అని తెలియజేశారు.. 

 

 ఈ సినిమాలో…అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి,‌ సతీష్ సారిపల్లి కీలకపాత్రలో కనిపించనుండగా..ఆర్ట్ డైరెక్టర్ గా శేఖర్ ఇప్పకాయల, ఎడిటర్ గా దుర్గ నరసింహ వ్యవహరిస్తున్నారు. యస్. కె భాజీ  మ్యూజిక్ అందిస్తుండగా ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సౌండ్ డిసైనర్ గా పనిచేస్తున్నాడు.

Also read: Maglev Train: ప్రపంచంలోనే హైస్పీడ్ రైలు, గంటకు 623 కిలోమీటర్లు

Also read: JEE Main 2024 Session 1 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, అగ్రస్థానం తెలుగు రాష్ట్రాలకే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News