Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్ పారితోషికం రూ. 60 కోట్లా ?

Pawan Kalyan remuneration for PSPK: హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేయనున్న తన అప్‌కమింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ భారీ పారితోషికం (Pawan Kalyan remuneration) తీసుకుంటున్నాడంటూ మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Written by - Pavan | Last Updated : Sep 8, 2021, 12:32 PM IST
  • మరోసారి వార్తల్లోకెక్కిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
  • పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యథిక పారితోషికమా ?
  • ప్రస్తుతం హరి హర వీర మల్లు, భీమ్లా నాయక్ చిత్రాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్ పారితోషికం రూ. 60 కోట్లా ?

Pawan Kalyan remuneration for PSPK: పవన్ కల్యాణ్ పారితోషికం మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో వకీల్ సాబ్ మూవీ కోసం పవన్ కల్యాణ్ రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ (Pawan Kalyan remuneration for Vakeel Saab) తీసుకున్నాడని రూమర్స్ గుప్పుమన్నాయి. ఆ రూమర్స్ ఇంకా సద్దుమణగక ముందే తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేయనున్న తన అప్‌కమింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ భారీ పారితోషికం (Pawan Kalyan remuneration) తీసుకుంటున్నాడంటూ మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్, నటుడు పవన్ కల్యాణ్ PSPK28 సినిమాకు కలిసి పని చేయబోతున్నారు. మైత్రి మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే, వకీల్ సాబ్ మూవీ సక్సెస్ కావడంతో హరీష్ శంకర్ (Harish Shankar) సినిమాకు పవన్ కల్యాణ్ తన పారితోషికాన్ని రూ. 60 కోట్లకు పెంచాడని.. అందుకు మైత్రి మూవీ మేకర్స్ కూడా దాదాపు ఓకే చెప్పారనేది తాజాగా వినిపిస్తున్న రూమర్స్ సారాంశం. 

PSPK28 సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ సినిమాకు భగత్ సింగ్ అనే టైటిల్‌ని (Bhagat Singh title for PSPK28) పరిశీలిస్తున్నారట. కథకు, కథలో పవన్ కల్యాన్ పోషించబోయే పాత్రకు అలాంటి టైటిల్ అయితేనే కరెక్టుగా సూట్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తున్నట్టు టాలీవుడ్ టాక్.

Also read: Bhagath Singh: పవన్ కల్యాణ్ PSPK28 సినిమాకు టైటిల్ ఇదేనా ?

ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఎంత అనేది ఎవరికీ తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఫిలింనగర్‌లో వినిపిస్తున్న ఆసక్తికరమైన చర్చ మాత్రం ఇదే. ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యథిక పారితోషికం (Pawan Kalyan remuneration for PSPK28) ఇదే అవుతుంది. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు కానీ.. గతంలో ఏ సినిమాకు కూడా ఆయన ఈ స్థాయిలో పారితోషికం (Pawan Kalyan's remuneration) మాత్రం అందుకోలేదు. 

ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరి హర వీర మల్లు, భీమ్లా నాయక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. హరి హర వీర మల్లు చిత్రాన్ని (Hari Hara Veera Mallu movie) ఫేమస్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండగా ఎ.ఎం రత్నం, ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ జంటగా నటిస్తోంది.

Also read : Hari Hara Veera Mallu release date: హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఖరారు

భీమ్లా నాయక్ సినిమాలో (Bheemla Nayak movie) రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also read : Pawan Kalyan Birthday: ఓ తెలుగు నటుడికి అంత క్రేజా..! ఆయన పుట్టినరోజుకీ ఏకంగా అమెరికాలో స్పెషల్ హాలిడే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News