Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'లో అలనాటి హీరోయిన్?

Pawan Kalyan: ఓ వైపు రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూనే.. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 10:05 PM IST
Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'లో అలనాటి హీరోయిన్?

Ustaad Bhagat Singh Movie update: గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)-హరీష్‌ శంకర్‌ (Harish shankar) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (UstaadBhagatSingh). మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఈ మూవీలో అలనాటి హీరోయిన్ గౌతమి ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

 ఉస్తాద్‌ భగత్‌ సింగ్ కొత్త షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఇతర నటీనటులపై సీన్స్ చిత్రీకరించారు. అయితే మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్‌ కూడా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో పవర్ పుల్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ తోపాటు పవన్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు, సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాలు చేస్తున్నారు. 

ఓ వైపు పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేస్తున్నాడు పవన్. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో వెంటనే విజయవాడ వెళ్లిన పవన్ రోడ్డుపై బైఠాయించి బాబుకు సంఘీభావంగా నిరసన తెలియజేశారు. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 

Also Read: Gadar 2 OTT Release Date: ఓటీటీలోకి 'గదర్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News