Priyanka Chopra: అమెరికాలో ప్రసారం కానున్న ప్రముఖ రియాలిటీ షో...'ది యాక్టివిస్ట్'(The Activist). గ్లోబల్ యాక్లివిస్ట్ సంస్థ రూపొందిస్తుండగా అక్టోబర్ నుంచి సీబీఎస్(CBS) ఛానల్‌లో ప్రసారం కానుంది. సామాజిక అంశాల గురించి సాగే ఈ షో చుట్టూ వివాదాలు రాజుకోవడంతో.. హోస్ట్‌గా చేస్తున్న నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) బహిరంగంగా అందరికీ క్షమాపణలు(Sorry) చెప్పింది.
ప్రియాంకతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మొత్తం ఆరుగురు పార్టిసిపెంట్స్ పాల్గొంటారు. అందులో కనీసం ముగ్గురు పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తారు. ఇందులో చర్చ జరిగిన తర్వాత వారిచ్చే సూచనలను జీ 20(G20) సమావేశంలో వివరించాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సామాజిక అంశాలను టీవీలోకి షోగా చేయడంపై వివాదం చెలరేగింది.
Also Read: Rashmika Mandanna: సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది: రష్మిక
— PRIYANKA (@priyankachopra) September 16, 2021
ఈ వివాదంపై ప్రియాంక చోప్రా(Priyanka Chopra) స్పందించింది.‘''గతవారం నుంచి ఎంతోమంది చేస్తున్న కామెంట్స్ నన్ను బాధపెట్టాయి. ప్రజలకు మంచి చేసే విషయాల కోసం అందరూ చేతులు కలిపితే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎందరో సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది''’ అని చెప్పింది. ఇంకా.. ‘'మీరు తప్పుగా భావిస్తున్న ఈ షోలో నేను పాల్గొనడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు తెలుసు. దానికి క్షమాపణలు'’ అని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి