Telugu Sequel Movies: ఈ హీరోయిన్ తో సీక్వెల్ తీస్తే అంతే సంగతులు!

Rakul Preet: ఈ మధ్యకాలంలో.. టాలీవుడ్ లో సీక్వెల్స్ హవా బాగా నడుస్తోంది. చాలా వరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి.. సీక్వెల్స్ వస్తున్నాయి. కానీ ఒక హీరోయిన్ కి మాత్రం ఈ సీక్వెల్స్ అసలు అచ్చి రావడం లేదు. గత కొద్దిరోజులుగా తెలుగు తనకి దూరంగా ఉంటున్న ఆమె బాలీవుడ్ లో ఇప్పుడు పేరు తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 23, 2024, 08:32 PM IST
Telugu Sequel Movies: ఈ హీరోయిన్ తో సీక్వెల్ తీస్తే అంతే సంగతులు!

Rakul Preet Bharateeyudu 2: ఈమధ్య ఎప్పుడో.. బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి సీక్వెల్స్ ఇప్పుడు వస్తున్నాయి. 5, 10 ఏళ్ల క్రితం సినిమాలు మాత్రమే కాక.. 20 ఏళ్ల క్రితం సినిమాలకు కూడా సీక్వెల్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు డైరెక్టర్లు. కానీ ఒక హీరోయిన్ కి మాత్రం సీక్వెల్స్ అసలు అచ్చి రావడం లేదు. ఆమె చేసిన సీక్వెల్ సినిమాలు అన్నీ.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. 

ఆమె మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి.. అయిన రకుల్ దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. అయితే స్పైడర్ సినిమా తర్వాత.. మళ్లీ ఆమె తెలుగులో పెద్దగా కనిపించలేదు. తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో.. మళ్లీ బాలీవుడ్ కి పయనమైంది రకుల్.

రకుల్ కెరియర్ లో నటించిన సీక్వెల్ సినిమాలు మూడే మూడు. ఆసక్తికరంగా ఆ మూడు సినిమాలు.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. మొదటిసారిగా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కిక్ కి సీక్వల్ గా వచ్చిన కిక్ 2 లో నటించింది రకుల్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ నాగర్జున సరసన మన్మధుడు వంటి క్లాసిక్ సినిమాకి.. సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు 2 లో నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. 

ఇక తాజాగా కల్ట్ సినిమా భారతీయుడు కి సీక్వల్ గా వచ్చిన భారతీయుడు 2 లో నటించింది రకుల్. ఆ సినిమా కూడా ఎంత భారీ డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో రకుల్ ప్రీత్ కి సీక్వెల్స్ కలిసి రావడం లేదు అని, ఆమె వాటికి దూరంగా ఉంటే బెటర్ అని ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన రకుల్.. అక్కడే జాకీ భాగ్నాని అనే ఒక బాలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాలీవుడ్ లో కూడా.. సినిమాల జోరు బాగా తగ్గించేసింది. ఈమె మళ్లీ తెలుగులో కనిపించే అవకాశాలు తక్కువే కానీ.. ఈమె గురించి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.

Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ

Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News