RRR New Record: మార్చ్ 25 2022 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే.మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వచించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్ సొంతం చేసుకొని ముందుకు వెళ్తుంది.
ఆర్ఆర్ఆర్... రాజమౌలి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. రికార్డులు సృష్టిస్తూ వసూళ్లు సాధిస్తున్న ఆర్ఆర్ఆర్ 500కోట్ల వసూళ్లు సాధించిందని నిర్మాత దానయ్య ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్... హాలీవుడ్ చిత్రం బ్యాట్మాన్ను కూడా మించి పోయింది. ఆర్ఆర్ఆర్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి. మూడు రోజుల్లోనే 500కోట్లను కొల్లగొట్టేసింది ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మార్చి 25 నుంచి 27 వరకు ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసింది. బ్యాట్‌మాన్ కేవలం 350 కోట్లు మాత్రమే సాధించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రం ఐదొందల కోట్లు కొల్లగొట్టింది. మున్ముందు ఆర్ఆర్ఆర్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
#RRR is setting new BENCHMARKS... ₹ 500 cr [and counting]... WORLDWIDE GBOC *opening weekend* biz... EXTRAORDINARY Monday on the cards... #SSRajamouli brings back glory of INDIAN CINEMA. Note: Non-holiday release. Pandemic era. pic.twitter.com/ztuu4r9eam
— taran adarsh (@taran_adarsh) March 28, 2022
తెలుగు రాష్ట్రాల్లో 3రోజుల్లో అత్యధిక షేర్ సాధించి ఆర్ఆర్ఆర్ నెంబర్ వన్‌గా రికార్డు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ 139.27 కోట్లు రాబట్టేసింది. బాహుబలి 2 సాధించిన గత రికార్డు 74.40 కోట్ల కలెక్షన్లతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ రికార్డు కొల్లగొట్టేసి బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చేసింది. హిందీలో అయితే ఆర్ ఆర్ ఆర్ కేవలం మూడు రోజుల్లోనే 74.50 కోట్లను రాబట్టింది. ఇప్పుడు 500కోట్ల గ్రాస్ మార్క్‌ను పూర్తి చేసిన ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్ల మీద కన్నేసి ముందుకు సాగుతోంది. ఈ వారాంతంలో వెయ్యి కోట్ల మార్కును కూడా చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. ఓవరాల్‌గా 3వేల కోట్లు దాటుతుందని అంచనాలున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీ..
ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. బ్రిటీష్ పాలనపై.. కల్పిత కథతో తీసిన ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో భారీ తరాగణం నటిచింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా.. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్గన్ సహా, సముద్రకని, శ్రియాలు కీలక పాత్రల్లో కనిపించారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook