Samantha: స్టార్ బ్యూటీ సమంత.. ఒకప్పుడు ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సమంత కమర్షియల్ సినిమాలతో.. మాత్రమే కాక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్లు.. అందుకుంది.
కానీ నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కెరియర్ కూడా బాగా పడిపోయింది. నిజానికి విడాకుల తర్వాత సమంత చేసిన సినిమాలు కూడా తక్కువే. ఇక అందులో హిట్ అయిన సినిమాలు..ఇంకా తక్కువ. ఖుషి సినిమా తప్ప మిగతా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.
ఈ నేపథ్యంలో సమంతకి ఆఫర్లు తగ్గిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి సమయంలో రామ్ చరణ్.. వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం అనుకుంటే.. సమంత ఆ సినిమాకి నో చెప్పి అభిమానులకి సైతం షాక్ ఇచ్చింది. కెరియర్ పరంగా ఇది సమంత తీసుకున్న బ్యాడ్ డెసిషన్ అని అభిమానులు సైతం కామెంట్ లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది వాదన మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. సమంత కి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు బాగానే వస్తున్నాయని.. కానీ నాగచైతన్య విషయంలో తన తప్పు లేకపోయినా తెలుగువారు సమంతని నిందించడం వల్ల.. తెలుగు సినిమా ఇండస్ట్రీపై అసహనంగా ఉంది అని అంటున్నారు. అందుకే ఒకవేళ తెలుగు సినిమా చేసిన.. ఆ చిత్రం తన సొంత బ్యానర్ పైన.. లేకపోతే తనకు చాలా ఆప్తులైన వారి కోసమే మాత్రం చేయనున్నట్లు వినికిరి. అంతేకాకుండా సమంతకి తెలుగులో క్రేజ్ తగ్గే అవకాశం మాత్రం లేదు అని కూడా వారి అభిప్రాయం.
2017లో సమంత నాగచైతన్యల పెళ్లి సమయంలో కూడా సమంత కెరియర్ కి..ఫుల్ స్టాప్ పడిపోయినట్లే అని చాలామంది అనుకున్నారు. పెళ్లి తర్వాత సమంత సినిమాలలో కనిపించదు అని చాలామంది కామెంట్లు చేశారు. కానీ పెళ్లి తర్వాత సమంత చేసిన రంగస్థలం సినిమా ఆమె కెరియర్ ను కీలక మలుపు తిప్పింది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా.. విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత సమంతకి వరుసగా బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి. పెళ్లి తర్వాత సమంతకి ఆఫర్లు రావు అన్న వాళ్ళ నోర్లు మూయిస్తు ..సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకువెళ్ళింది. యూటర్న్, మజిలీ, ఓ బేబీ, సూపర్ డీలక్స్, ఇలా… వరుస బ్లాక్ బస్టర్ లతో సమంత మళ్లీ స్టార్ స్టేటస్ అందుకుంది సామ్.
ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో.. ఆమెకి మళ్లీ అలాంటి కెరియర్ మలుపు తిప్పే సినిమానే అవసరం. ప్రస్తుతం సమంత తెలుగులో తన సొంత ప్రొడక్షన్ బ్యానర్.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతకంపై..మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సమంతకు రామ్ చరణ్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో.. హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమాని తేలిగ్గా రిజెక్ట్ చేసేసిందట ఈ హీరోయిన్. అయితే ఈ సినిమాని ఒప్పుకొని.. ఒకవేళ సినిమా హిట్ అయితే మళ్లీ అది సమంత కెరియర్ ..కి బాగా బూస్ట్ ఇచ్చేది. కాబట్టి అభిమానుల సంగతి ఎలా ఉన్నా.. సమంత తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా.. తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్ పే నంబర్ అంటూ పిచ్చి రాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter