Sati Leelavati: సతీ లీలావతి గా లావణ్య త్రిపాఠి.. కెమెరా స్విచ్ ఆన్ చేసిన వరుణ్ తేజ్..

Varun Tej Lavanya : మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే వైవిద్యమైన ఎంటర్టైన్మెంట్ సినీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సతీ లీలావతి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో రంగ రంగ వైభవంగా జరిగింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 3, 2025, 04:47 PM IST
Sati Leelavati: సతీ లీలావతి గా లావణ్య త్రిపాఠి.. కెమెరా స్విచ్ ఆన్ చేసిన వరుణ్ తేజ్..

Lavanya Tripathi Upcoming Movie : ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణలో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్రధాన పాత్రలలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం 'సతీ లీలావతి'. ఈ సినిమా సోమవారం ఉద‌యం రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో.. పూజా కార్య‌క్ర‌మాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, చిత్ర సమ‌ర్ప‌కులు జెమినీ కిర‌ణ్‌, నిర్మాతలు హ‌రీష్ పెద్ది, వి.ఆనంద ప్ర‌సాద్, అన్నే ర‌వి, డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య, సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ముహూర్త‌పు స‌న్నివేశంలో నిర్మాత హ‌రీష్ క్లాప్ కొట్టగా, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, సీనియ‌ర్ డైరెక్ట‌ర్ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ సినిమాగౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 ఈ సందర్భంగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య మాట్లాడుతూ, “'సతీ లీలావతి' ఒక ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకునే రొమాంటిక్ డ్రామాగా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించే అంశాల‌తో సినిమా తెర‌కెక్కుతుంది. లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ జోడీ ఫ్రెష్ లుక్‌తో మెప్పించ‌నున్నారు. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం” అన్నారు.

చిత్ర నిర్మాత‌లు నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి మాట్లాడుతూ, “మా జర్నీలో మాకు సపోర్ట్ చేస్తున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌ అధినేత కిర‌ణ్‌గారికి ధ‌న్య‌వాదాలు. మా డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య‌గారు స్క్రిప్ట్ చెప్ప‌గానే నేటి త‌రం ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా అనిపించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం” అన్నారు.

కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాలలో నటించిన సంగతి తెలిసింది. వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కనిపించింది. ఇక ఆ తరువాత ఈ హీరోనే గత సంవత్సరం పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. అయితే పెళ్లి తర్వాత లావణ్య వెబ్ సిరీస్ లో కనిపించింది కానీ సినిమాలలో కనిపించలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

Also Read: Baby Born: 'కలయిక' లేకుండానే సంతానం .. పిల్లలను కనాలంటే ఇకపై మహిళలు అవసరం లేదు

Also Read: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News