MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు.. నాది ఇందులో కృష్ణుని పాత్ర మాత్రమే ‌‌- నరేశ్‌

MAA elections: ‘మా’లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చానని చెప్పారు నరేశ్. ‘మా’ రాజకీయ వేదిక కాదని.. పదవీ వ్యామోహాలు ఉండకూడదని చెప్పుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 05:55 PM IST
  • ‘మా’ రాజకీయ వేదిక కాదు..
  • "మా" లో పదవీ వ్యామోహాలు ఉండకూడదు
  • కొవిడ్‌ సమయంలో ‘మా’లో రెండు గ్రూపులు మొదలయ్యాయి ‌‌- నరేశ్
MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు.. నాది ఇందులో కృష్ణుని పాత్ర మాత్రమే ‌‌-  నరేశ్‌

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) మసకబారిన సమయంలోనేను ఎన్నికల్లో నిలబడి జాయింట్‌ సెక్రటరీగా గెలిచాను అని సీనియర్‌ నటుడు నరేశ్‌ (Senior tollywood actor Naresh) అన్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు (Manchu Vishnu), అతని ప్యానల్‌తో కలిసి నరేశ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘మా’లో తాను 20 ఏళ్లు కేవలం సాధారణ సభ్యుడిగానే ఉన్నానని గుర్తు చేశారు. ‘మా’లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చానని చెప్పారు నరేశ్. ‘మా’ రాజకీయ వేదిక కాదని.. పదవీ వ్యామోహాలు ఉండకూడదని చెప్పుకొచ్చారు. కొవిడ్‌ (Covid) సమయంలో ‘మా’లో రెండు గ్రూపులు మొదలయ్యాయన్నారు. అందులో ఒక బృందం మీడియా వద్దకి వెళ్లి నిందించే ప్రయత్నం చేసిందని బాధపడ్డారు.

కరోనా సమయంలో భవనం కంటే మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యతిచ్చామని.. తాము చేయాల్సిన మంచి పనులు ఇంకా ఉన్నాయన్నారు. ‘మా’ (MAA) అధ్యక్షుడిగా సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని తాను చెప్పానని.. ‘మా’ భవనం కోసం తాను ప్రయత్నం చేశా అని అన్నారు నరేశ్. తన తర్వాత ‘మా’కి మంచి అధ్యక్షుడిని అందించడం తన బాధ్యత అని చెప్పారు.

Also Read : IPL 2021: LIVE మ్యాచ్‌లో పిచ్ పై పడుకున్న స్మిత్.. మీమ్స్ తో హోరెత్తిన ట్విట్టర్‌

మా అధ్యక్ష కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే ‘మా’ వైభవం కోల్పోతుందన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ తనకు మంచి స్నేహితుడని అయితే మంచు విష్ణు (Manchu Vishnu) ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడని చెప్పారు. తనది ఇందులో కృష్ణుని (Krishna) పాత్ర అని ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నానని అన్నారు. మా ఎన్నికల్లో (MAA Elections) విష్ణుకి (Vishnu)తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాని నరేశ్ తెలిపారు.

Also Read : మీకు తెలియకుండానే... మీ జీవితకాలంలో ఎంత ప్లాస్టిక్ తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News