Vijay Deverakonda : ఫ్లాప్స్ టైం లో విజయ్ దేవరకొండ ఎక్స్పరిమెంట్.. ఫ్యామిలీ స్టార్ కి ఇది మైనస్ కానుందా!

Family Star : ఈమధ్య కాలంలో సినిమాల నిడివి బాగా తగ్గిపోయింది. రెండున్నర గంటల కంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు అంతగా ఆడటం లేదు. కానీ ఇలాంటి సమయం లో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రన్ టైం చూసి ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2024, 10:42 AM IST
Vijay Deverakonda : ఫ్లాప్స్ టైం లో విజయ్ దేవరకొండ ఎక్స్పరిమెంట్.. ఫ్యామిలీ స్టార్ కి ఇది మైనస్ కానుందా!

Family Star Run Time

వరుస డిజాస్టర్ లతో సతమతమైన యువ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు విజయ్ ఫామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది

అయితే తాజాగా ఇప్పుడు సినిమా రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రన్ టైం ఎక్కువగా ఉన్న కూడా సినిమాలకి అదే మైనస్ పాయింట్ గా మారిపోతోంది. అయితే ఫ్యామిలీ స్టార్ విషయంలో అదే జరగనుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైం రెండు గంటల 40 నిమిషాలు. సినిమా బాగానే ఉంటే రన్ టైం విషయంలో ఇబ్బంది రాకపోవచ్చు కానీ సినిమాకి కొంచెం నెగటివ్ టాక్ వచ్చినా కూడా రన్ టైం ఇంకా పెద్ద మైనస్ పాయింట్ గా మారిపోతుంది. 

ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ దేవరకొండ కెరియర్ కి కీలకం. ఎందుకంటే గీతా గోవిందం చిత్రం తర్వాత ఈ హీరోకి ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు. ఖుషి విజయం సాధించిన ఆ క్రెడిట్ మొత్తం సమంతా కి పోయింది. కాబట్టి ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయితే తప్పకుండా విజయ్ దేవరకొండ మార్కెట్ పరిపోవడం ఖాయం. అందులో విజయ్ అభిమానులంతా ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. గీతా గోవిందం దర్శకుడు మరోసారి తమ హీరోకి సూపర్ హిట్ అందిస్తారని నమ్మకంతో ఉన్నారు.

అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా రన్ టైం ఇంతలా పెట్టి విజయ్ దేవరకొండ రిస్క్ తీసుకుంటున్నాడా అని అభిమానులు భయపడుతున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని టీ సిరీస్ వారు సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News