South Korea Halloween stampede Reason in Telugu: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యు వాత, అక్కడ ఎక్కడ చూసినా శవాల కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో 149 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. హాలోవీన్ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత, అందులో గాయపడిన వారి కంటే గుండెపోటు కారణంగా చాలా మంది మరణించారు. శనివారం జరిగిన ఈ ఘటన తరువాత, సియోల్‌లో హాలోవీన్ ఈవెంట్ల సంఖ్య భారీగా తగ్గించారు.
ఇక 100 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక సెలబ్రిటీ కారణంగా ప్రజలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఒక వీధిలో ప్రజలు ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక సెలబ్రిటీని చూశారని అక్కడి మీడియా రిపోర్ట్ చేసింది. ఆమెను చూసిన తర్వాత వారంతా ఆమెవైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఇక తొక్కిసలాట జరిగిన వీధి కేవలం నాలుగు మీటర్ల వెడల్పు మాత్రమేనని, చాలా ఇరుకైనదని, సెడాన్ కారును పార్క్ చేయడం కూడా కష్టమని అలాంటి రోడ్డులో జనం ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించడంతో, ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరాడక గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇక సంఘటనా స్థలానికి అత్యవసర సేవలు అందించాలని అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ఆదేశించారు. ఘటనా స్థలంలో అత్యవసర వైద్య కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వైద్యాధికారులు చికిత్స నిమిత్తం హాస్పిటల్స్ కు తరలించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు మరియు 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారని అంటున్నారు.
ఇక ఈ ఘటనలో ఇరాన్, ఉజ్బెకిస్థాన్, చైనా మరియు నార్వే పౌరులైన 19 మంది విదేశీయులు కూడా మరణించారు. సాధారణ రోజుల్లో కంటే 10 రెట్లు అధికంగా జనం వచ్చారని, అక్కడి జనం సందడి చూడాలని కూడా కొంతమంది వచ్చారని అన్నారు. ఇక తొక్కిసలాట జరగడానికి ముందు జనాన్ని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు అక్కడే గంటపాటు చిక్కుకుపోయి అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్లిపోయారని కూడా చెబుతున్నారు.
Also Read: Brahmaji Counter: అనసూయ ‘ఆంటీ’ని వదలని బ్రహ్మాజీ.. ప్రభాస్ ను కూడా వాడేసుకున్నాడుగా!
Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook