Maa Nanna Super Hero OTT Streaming: భారతదేశంలోని అతిపెద్ద ఓటీటీ సంస్థలతో ZEE5కు ప్రత్యేక స్థానం ఉంది. మన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి విదేశీ ఓటీటీ సంస్థలు. కానీ మన దేశంలో జీ5 అతిపెద్ద ఓటీటీ సంస్థగా అవతరించింది. అంతేకాదు ఇందులో మనదేశంలోని అన్ని భాషలతో పాటు విదేశీ భాషలకు సంబంధించిన కంటెంట్ అందుబాటులోకి ఉంది. తాజాగా జీ5లో రీసెంట్ గా విడుదలైన తెలుగులో ఓ మోస్తరు విజయం సాధించిన ‘మా నాన్న సూపర్’ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. పూర్తి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయి చంద్ ల మధ్య అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించింది. ఆర్నా ఫీమేల్ లీడ్ రోల్లో నటించారు. CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్, VR గ్లోబల్ మీడియా బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే కదా. థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 15న స్ట్రీమింగ్ కు రానుంది.
‘మా నాన్న సూపర్ హీరో’ కథ విషయానికొస్తే.. హీరో జానీ (సుధీర్ బాబు) తన పెంపుడు తండ్రి (సాయాజీ షిండే) చేసిన అప్పులను తీర్చడానికి ఎన్నో ప్రయాసలు పడుతుంటాడు. జానీ పెంచిన తండ్రి అరెస్ట్ అవ్వడం, ఆయన రిలీజ్ కోసం రూ. 1 కోటిని సేకరించడానికి జానీ ఏయే పనులు చేశాడు? ఈ క్రమంలో సొంత తండ్రి ప్రకాష్ (సాయి చంద్)తో కలిసి చేసిన ట్రావెల్ ఏంటి? అన్నది ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.
నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరో అనేది తండ్రీ కొడుకుల అను బంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఎంతో ఉద్వేగభరితమైన కథనాన్ని ZEE5తో పంచుకోవడం సంతోషంగా ఉంది. ZEE5 ఇస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ZEE5 ప్లాట్‌ఫారమ్‌తో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ.. ‘ZEE5తో నా ప్రయాణం లూజర్తో ప్రారంభం కావడం విశేషం. అది అద్భుతమైన అనుభవం, భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరోతో మరో మైలురాయిని చేరుకున్నారు. ‘తండ్రి ప్రేమే కొడుకు బలానికి పునాది’ అన్న సామెతతో ఈ సినిమాలో సుధీర్ బాబు ఆ పాత్రకి ప్రాణం పూశారన్నారు. థియేటర్స్ లో చూడని వారు ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు అన్నారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరోకి టాకీస్‌లలో మంచి విజయం నమోదు చేసింది. మిగిలిన ప్రేక్షకులు ఓటీటీ వేదికగా ఈ సినిమా మిగతా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ZEE5 గురించి...జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్. ఎన్నో భాషలకు చెందిన కంటెంట్ టెల్లర్గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ జీ5 సొంతం. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో జీ5 రంజింపజేస్తోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter