కోలీవుడ్‌లో స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తూనే తరచుగా వివాదాల్లో నిలిచే శింబు మరోసారి వార్తల్లోకెక్కాడు. తాను ఈ ఏడాది ఒకేసారి మూడు చిత్రాలను చేయనున్నట్టు శింబు మంగళవారం ఓ ప్రకటన చేశాడు. అందులో ఒకటి విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాగా మరొకటి గౌతమ్ మీనన్ సినిమా. మూడో సినిమా తన డైరెక్షన్లోనే ఉండనున్నట్టు శింబు స్పష్టంచేశాడు. శింబు చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వెల్లువెత్తాయి. ఒకేసారి మూడు సినిమాలు చేయటం సంగతి తర్వాత కానీ ముందుగా సరైన సమయానికి షూటింగ్‌లకు రావటం నేర్చుకోమంటూ చాలా మంది శింబుపై సెటైర్లు వేశారు. అయితే ఆ కామెంట్స్ కాస్తా శింబు వరకు వెళ్లాయో ఏమో కానీ.. తనని విమర్శించిన వారికే అన్నట్టుగా శింబు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినట్టు కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది.
"నేను నా మొదటి సినిమా చేసినప్పుడు కూడా ఉదయం 10 గంటలకే సెట్‌కు వెళ్లాను కానీ హడావుడి చేయలేదు. మొదటి నుంచి దర్జాగానే పెరిగినోడిని. నాకు రోబో లాగా పనిచేయడం తెలియదు. మొదటి నుంచీ నా లైఫ్ స్టైల్ ఇంతే. తల్లిదండ్రులు సంపాదించిపెట్టిందే కాకుండా నాకు నేను కూడబెట్టుకున్న ఆస్తితోనే దర్జాగా బతికేయగలను. నాకు రూ.1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నా జీవితంలో నాకు నచ్చిన విధంగా ఆనందంగా బతికేంత ఆస్తి నాకు ఉంది. సినిమాలు అంటే ఇష్టం కనుకే సినిమాలు చేస్తున్నాను కానీ బతుకుదెరువు కోసం కాదు. అందుకే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ప్రవర్తన మార్చుకుంటా కానీ నాపై సెటైర్లేసేంత అవసరం లేదు" అని శింబు తన విమర్శకులకు బదులు ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
శింబు తండ్రి టి రాజేంద్రన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా, గేయ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేసి మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోనూ రాణించాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం అంతగా విజయవంతం అవలేదు. టీ రాజేందర్‌కి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన శింబు అనతికాలంలోనే తనదైన శైలితో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోయిన్స్‌తో ఎఫైర్స్ విషయంలోనూ శింబుపై అనేక కథనాలు వచ్చాయి. అయితే, నటుడిగా ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడో... అలాగే తన ప్రవర్తనతో పరిశ్రమలో కొంతమంది విరోధులను కూడా సంపాదించుకున్నాడు అంటుంటారు అతడి గురించి తెలిసినవాళ్లు.