Thalapathy Vijay record remuneration ever: చివరిగా తమిళ సూపర్ స్టార్ విజయ్ వారిసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఆయన రికార్డ్స్ అందుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దాదాపు 120 కోట్ల వరకు ఆయన అప్పట్లోనే సినిమా కోసం ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరిగింది.
అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో భారీ డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో మాత్రం మంచిగా వసూలు చేసింది. ఇప్పుడు విజయ్ మరొక రికార్డు బద్దలు కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఆయన ఒక రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ ప్రస్తుతానికి లోకేష్ కనకరాజు డైరెక్షన్లో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Virupaksha OTT Release: ఓటీటీలోకి విరూపాక్ష.. ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక నిర్మాణ సంస్థ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చింది. నిజానికి వెంకట్ ప్రభు సినిమాలన్నీ మినిమం బడ్జెట్ లోనే తెరకెక్కుతూ ఉంటాయి. అయితే విజయ్ స్టార్డం నేపథ్యంలో ఏకంగా విజయ్ రెమ్యూనరేషన్ కోసమే దాదాపు 200 కోట్లు కే ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే విజయ్ అంత రెమ్యునరేషన్ అందుకుంటే కనుక ఇది భారతదేశంలోనే ఒక హీరో అందుకునే రెమ్యూనరేషన్ లో అత్యధికమని చెప్పొచ్చు.
ఆ విధంగా ఆయన ఒక రికార్డు క్రియేట్ చేసినట్లే చెప్పాలి. ఇక మేకింగ్ కాస్ట్ మరో 75 కోట్ల వరకు అవుతుందని మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ కలిపితే 300 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా తీసుకురావచ్చు అని ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కస్టడీ లాంటి ఒక డిజాస్టర్ సినిమాని అందించిన వెంకట్ ప్రభు కథను నమ్మి ఇలా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 300 కోట్లు పెట్టడానికి ముందుకు రావడం మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also Read: Bichagadu 2 Review: విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి