Megastar Chiranjeevi Appreciates Tillu Square: మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ ..

Megastar Chiranjeevi Appreciates Tillu Square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఈ నెల 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి .. ఈ సినిమాపై ప్రశంసల ఝల్లు కురిపించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2024, 04:10 PM IST
Megastar Chiranjeevi Appreciates Tillu Square: మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ ..

Megastar Chiranjeevi Appreciates Tillu Square: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' అందరి అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మూడో రోజు కూడా వసూళ్ల వర్షం కురపించింది. మొత్తంగా సమ్మర్ సీజన్‌లో 'టిల్లు స్క్వేర్' మంచి చిత్రంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సినిమాను చూసిన పద్మ విభూషణ్ చిరంజీవి .. టిల్లు స్క్వేర్' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో చిత్ర యూనిట్ పండగ చేసుకుంటుంది. మంచి చిత్రం చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా సినిమా బాగుంటే.. దాన్ని ప్రమోట్ చేయడంలో ఎపుడు ముందుంటారు చిరంజీవి. తాజాగా 2022లో విడుదలైన ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. తాజాగా చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన 'టిల్లు స్క్వేర్' చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందాన్ని తన ఇంటికి  పిలిపించుకొని స్పెషల్‌గా అభినందించడం విశేషం. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ఆయన విలువైన సమయాన్ని 'టిల్లు స్క్వేర్' కోసం కేటాయించారు. 'డీజే టిల్లు' తనకు బాగా నచ్చిందనని మెచ్చుకున్నారు. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కూడా ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ సందర్భంగా చిత్ర బృందంపై ప్రశంసల ఝల్లు కురిపించారు.

"డీజే టిల్లు నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చూసి ముచ్చటేసి, సిద్ధుని ఇంటికి పిలిపించుకొని అభినందించాను. సిద్ధుని మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు సిద్ధు 'టిల్లు స్క్వేర్'తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమాను నేను చూశాను. అద్భుతం.. నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. మొదటి సినిమా హిట్ అయ్యి, దానికి సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కానీ సిద్ధు, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ మరియు మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ ని అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ 'టిల్లు స్క్వేర్'ని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాము, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో అని సిద్ధు నాతో చెప్పాడు. దీని వెనుక దర్శకుడు మల్లిక్ రామ్, ఎడిటర్ నవీన్ నూలి సహా అందరి సమిష్టి కృషి ఉందని తెలిపారు. నటుడిగా, కథకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే దర్శకుడు మల్లిక్, నిర్మాత వంశీ, ఎడిటర్ నవీన్ ని అభినందిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగల బలమున్న మనిషి వంశీ. మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అంతేకాదు ఉత్తమ యువ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు వంశీ. అలాగే 'మ్యాడ్' సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్.. ఈ సినిమా రచనలో సహకారం అందించాడని తెలిసింది. 'టిల్లు స్క్వేర్' చిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమా యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన అని కొందరు అంటున్నారు. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా. నేను ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ సినిమాకి ఎంజాయ్ చేయండి." అంటూ చిరంజీవి చెప్పిన మాటలు చిత్ర బృందాన్ని ఉత్సాహంలో నింపాయి.

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎడిటర్ నవీన్ నూలి, రచయిత-దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారు.

'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరచగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.

Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News