Varun Sandesh Financial Struggles : చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితిలో వరుణ్‌ సందేశ్.. నాటి సంగతులు చెప్పిన వితిక షెరు

Varun Sandesh Financial Struggles వరుణ్‌ సందేశ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడటంతో కెరీర్ తిరుగులేదని అనుకున్నారు. కానీ అంతలోనే వరుణ్ సందేశ్ పాతాళానికి పడిపోయాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 06:52 PM IST
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట
  • ఆర్థిక కష్టాల్లో వరుణ్‌ సందేశ్ వితికా షెరు
  • ఐదు వేలు కూడా లేని పరిస్థితి
Varun Sandesh Financial Struggles : చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితిలో వరుణ్‌ సందేశ్.. నాటి సంగతులు చెప్పిన వితిక షెరు

Varun Sandesh Financial Struggles హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం సినిమాలతో వరుణ్ సందేశ్‌కు తిరుగులేకుండా పోయింది. అయితే ఈ రెండు సినిమాలు వరుణ్‌ సందేశ్‌ను స్టార్‌ను చేశాయి. ఆ తరువాత ఏ ఒక్క సినిమా కూడా హిట్టుగా నిలవలేదు. ఏమైంది ఈవేళ, మరో చరిత్ర సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే మరో చరిత్ర మాత్రం అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేదు. ఆ తరువాత వరుణ్‌ సందేశ్ వితిక షెరులు కలిసి నటించడం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక సినిమాలేవీ వర్కౌట్ కాక యూఎస్‌కి కూడా వెళ్లారు. అక్కడా ఉండలేక తిరిగి వచ్చారు. బిగ్ బాస్ షోతో మళ్లీ ఫాంలోకి వచ్చారు. కానీ ఇంత వరకు వరుణ్‌ సందేశ్‌కు సరైన ప్రాజెక్ట్ పడలేదు. హిట్టు కూడా రాలేదు.

అయితే యూఎస్‌లో బిజినెస్ పెట్టాలనే ఆలోచనలు కూడా చేశారట. అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆర్థికంగా ఎంతో చితికిపోయారట. కనీసం చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితికి వచ్చేశారట. కానీ తమకెప్పుడూ కూడా కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలనే ఆశలు, కోరికలు ఉండేవి కాదట. తాను సంతోషంగా ఉంటే వరుణ్‌ చూడాలని అనుకుంటాడని, వరుణ్ సందేశ్ హ్యాపీగా ఉంటే తాను చూడాలని అనుకుంటామంటూ వితిక షెరు తమ కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

 

వరుణ్ సందేశ్, వితిక షెరులు బిగ్ బాస్ మూడో సీజన్‌లో కనిపించడంతో మరోసారి ట్రెండ్ అయ్యారు. అంతకు ముందు అసలు వారిద్దరూ ఉన్నారనే సంగతి కూడా అంతా మరిచిపోయారు. బిగ్ బాస్ షోతో వితిక షెరుకి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. వరుణ్ సందేశ్‌కి మాత్రం ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. అందుకే వరుణ్‌ సందేశ్ టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ నుంచి వచ్చాక వరుణ్‌ సందేశ్ కెరీర్ ఏమీ మారలేదు. ఇందు వదన అంటూ చేశాడు. అది బోల్తా కొట్టేసింది. మైఖెల్ సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించాడు. వితిక షెరు అయితే యాంకరింగ్ చేయాలన్న తన కోరికను సామజవరగమన అనే షోతో తీర్చేసుకుంది. యూట్యూబ్ చానెల్‌ ద్వారా మాత్రం బాగానే సంపాదించుకుంటున్నారు.

Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ

Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News