అభిషేక్ - ఐశ్వర్యలను ఉద్దేశించి ఓ నెటిజెన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అందమైన భార్యను పొందే అర్హత అభిషేక్ కు ఉందా ? అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్ చూసిన అభిషేక్ భగ్గుమన్నాడు. నెటిజన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
వివరాల్లోకి వెళ్లినట్లయితే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ ఏమని ట్వీట్ చేశాడంటే.. తల్లితండ్రుల ప్రజాదరణను వాడుకొని పైకి ఎదిగిన వారు అందమైన భార్యను పొందారని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా అర్హులు కాని వారికి అందమైన భార్యలు వచ్చారని అభిషేక్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్వీట్ బాబి డియోల్ పేరుతో ఉన్న నకిలీ ఐడీతో రావడం గమనార్హం.
#KKRvRR Stuart Binny Is Replica Of Abhishek Bachan frm Bollywood.
Both Got a Beautiful Wife without Deserving.
Both Got into Movies/ Cricket Because of their Father.Both Are "USELESS"
Retweet 🔃if you Agree.#ABDevilliers #KKRvRR @juniorbachchan @MayantiLanger_B @binny
— bobby deol (@aditaychopra) May 24, 2018
అభిషేక్ ఘాటైన రిప్లై ...
తాజా ట్వీట్ పై అభిషేక్ బచ్చన్ ఘాటుగా బదులిచ్చాడు. బ్రదర్.. నా అడుగు జాడల్లో ఒక మైలు దూరం ప్రయాణించు. నా దారిలో కనీసం పది అడుగులు ప్రయాణించినా చాలు నేను ప్రభావితమవుతాను. పక్క వారి గురించి కంటే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వు మెరుగు పరచుకోవడం కోసం సమయం వెచ్చించు. ఆ దేవుడికి తెలుసు ఎవరి ప్రయాణం వారిదేనని. తొందరగా నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నా అని అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో బదులిచ్చాడు.
Walk a mile in my shoes, brother. If you even manage 10 steps I’ll be impressed. Judging by your tweets don’t think you’ll make it too far! Spend time improving yourself, don’t worry about others. God knows, we all have our own journeys. Get well soon. 🤗
— Abhishek Bachchan (@juniorbachchan) May 24, 2018
నెటిజన్ ప్రతిస్పందన...
అభిషేక్ ఇచ్చిక కౌంటర్ కు ప్రతిస్పందించాడు ఆ నెటిజన్. తనను తాను సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశాడు..సరదాకే ఆ ట్వీట్ చేశా. ప్రశాంతమైన మీరు వ్యక్తుల్లో మీరు ఒకరు. థియేటర్లో మీ సినిమా ఆడకపోయినా... మీరు ధరించే సూట్స్ లో బాగుంటారు. ఆ ట్వీట్ కేవలం జోక్ మాత్రమే. మీ మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నా అని సదరు నెటిజన్ అన్నాడు
Ab that was just for funn.. Ur one of the koolest person , even I have seen tera jadu chalgya in theatres, I like the way u dress in suits, that was a joke and apologies if you feel bad, I agreed the pressure you or sachin tendulkars son has no normal person can bear.. Apologies
— bobby deol (@aditaychopra) May 24, 2018