అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..

Facebook ఎట్టకేలకు అవతార్ ఫీచర్ ను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్ ను వినియోగదారుల కోసం భారతదేశంలో తన సేవలను  ప్రారంభించింది. ప్రొఫైల్ ఫోటో కోసం కార్టూన్ లాంటి చిత్రాన్నివినియోగించుకోవడానికి అనుమతిచ్చింది.

Last Updated : Jul 2, 2020, 02:45 PM IST
అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..

హైదరాబాద్: Facebook ఎట్టకేలకు అవతార్ ఫీచర్ ను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్ ను వినియోగదారుల కోసం India‌లో తన సేవలను ప్రారంభించింది. ప్రొఫైల్ ఫోటో కోసం కార్టూన్ లాంటి చిత్రాన్నివినియోగించుకోవడానికి అనుమతిచ్చింది. ఈ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి రానుందని, ఇకపై తమ పోలికలను కలిగిన స్వంత అవతార్‌లను సృష్టించుకోవచ్చని వెల్లడించింది. Facebook వినియోగదారులు ఆహ్లాదకరమైన, తమ అభిరుచులకు అనుగుణంగా  భావోద్వేగాలను పంచుకోగలుగుతారని పేర్కొంది. ఘోరం.. కొండచరియలు విరిగిపడి 50మంది దుర్మరణం

Also Read: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై ఈడీ కేసు

 

భారతీయ వినియోగదారుల కోసం ఈ అవతార్ ఫీచర్ అనుకూలీకరించబడిందని, ఈ ఫీచర్ ముఖాలు, కేశాలంకరణలతో పాటు పలురకాలుగా రాబోతుందని పేర్కొంది. వీటిని స్టోరీస్‌లో, ప్రొఫైల్ పిక్చర్‌గా, ఫేస్‌బుక్ మెసెంజర్ చాట్ విండోస్‌లో ఉపయోగించవచ్చని సూచించింది. వాట్సాప్ చాటింగ్ లో సైతం అవతార్లను పంచుకోవచ్చని తెలిపింది. కాగా ఇది Android మరియు iOS రెండింటిలోనూ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. 

Also Read: GVK గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ కేసు.. వందల కోట్ల చీటింగ్!

Trending News