విమానంలో యాపిల్ తినలేదా.. అయితే రూ.33 వేలు ఫైన్ కట్టండి..!

ఆ అమ్మాయి పారిస్ నుండి అమెరికా వెళ్లాలి. అందుకోసం డెల్టా ఎయిర్ లైన్స్‌ ద్వారా టికెట్ బుక్ చేసుకొని విమానం ఎక్కింది.

Last Updated : Apr 23, 2018, 11:27 PM IST
విమానంలో యాపిల్ తినలేదా.. అయితే రూ.33 వేలు ఫైన్ కట్టండి..!

ఆ అమ్మాయి పారిస్ నుండి అమెరికా వెళ్లాలి. అందుకోసం డెల్టా ఎయిర్ లైన్స్‌ ద్వారా టికెట్ బుక్ చేసుకొని విమానం ఎక్కింది. విమానం ఎక్కగానే అందరికీ స్నాక్స్ ఇవ్వడంతో పాటు ఓ యాపిల్ కూడా చేతిలో పెట్టింది ఎయిర్ హోస్టెస్. కానీ అదే యాపిల్ ప్రయాణికురాలి తాట తీర్చింది. ఆ యాపిల్‌ను తర్వాత తిందామని భావించి తన బ్యాగ్‌లో దానిని వేసుకుందామె. ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయింది.

అమెరికాలో దిగాక ఆమె బ్యాగ్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు బ్యాగులో యాపిల్ కనిపించింది. పైగా ఆ యాపిల్ కవరు మీద డెల్టా లోగో కూడా కనిపించింది. ఇంకేముంది.. ఒక దేశం నుండి మరో దేశానికి యాపిల్ పండును అక్రమ రవాణా చేసినందుకు 500 డాలర్లు (అనగా ఇండియన్ కరెన్సీలో రూ.33 వేలు) ఫైన్‌గా కట్టమన్నారు కస్టమ్స్ అధికారులు. ఆ మాట వినగానే ఆ అమ్మాయికి కళ్లు తిరిగినంత పనైంది. 

విషయమేమిటంటే.. ఏదైనా ఇతర దేశంలో విమానం ఎక్కి.. అమెరికాకి వస్తే మాత్రం నిషిద్ధ వస్తువులకు సంబంధించి కొన్ని నియమాలు పాటించాల్సిందే. అలా పాటించకుండా పలు ఆహార వస్తువులను తీసుకొస్తే మాత్రం భారీ స్థాయిలో ఫైన్ వసూలు చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. విమానంలో ఇచ్చిన పారిస్ యాపిల్‌ను ఆమె రూల్ ప్రకారం విమానంలోనే తినేయాలి.

ఆమె అలా తినకుండా అమెరికాకి తీసుకొచ్చింది కాబట్టి ఫైన్ కట్టాల్సిందేనని చెప్పారు అధికారులు. పాపం.. ఆ అమ్మాయి ఫైన్ కట్టక తప్పలేదు. అయితే ఫైన్ కట్టినా ఆ అమ్మాయి ఊరుకోలేదు. డెల్టా ఎయిర్ లైన్స్ మీద కేసు వేస్తానని తెలిపింది. యాపిల్‌ను విమానంలోనే తినాలని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పుండాల్సిందని.. అలా వారు చెప్పలేదు కాబట్టి ఆ ఫైన్‌కి ఎయిర్ లైన్స్ వారే బాధ్యత వహించాలని అంటుందామె 

Trending News