తొలి ప్రేమ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా !!

ప్రముఖ డైరక్టర్ వెంకీ అట్లూరీతో మూవీ చేసేందుకు హీరో నితిన్ సై అన్నాడు

Last Updated : Oct 4, 2019, 07:58 PM IST
తొలి ప్రేమ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా !!

ఇప్పటికే రెండు సినిమాలో చేతిలో ఉంచుకున్న యంగ్ హీరో నితిన్..  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో '' రంగ్ దే'' టైటిల్ తో దసరాకు మరో నితిన్ కొత్త సినిమా లాంఛ్ కాబోతోంది.  సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 
తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. తన రెండో ప్రయత్నంగా అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను నితిన్ తో లాక్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

ప్రస్తుతం నితిన్ చేతిలో 2 సినిమాలున్నాయి.  వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా సినిమా సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాలు చేస్తూనే రంగ్ దే సినిమాను స్టార్ట్ చేస్తుండటం గమనార్హం.

Trending News