Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?

Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 8, 2024, 04:18 PM IST
  • నాంపల్లి కోర్టుకు హజరైన నాగార్జున..
  • జడ్జీ ఎదుట కీలక వ్యాఖ్యలు..
Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?

Nagarjuna appears in nampally Court on Konda Surekha isseue: హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఆయన ధర్మాసనం ముందు తనవాదనలు వినిపిస్తున్నారు. నాగార్జున తరపున ఆయన లాయర్ అశోక్ రెడ్డి వాదనలు సైతం విన్పించారు. నాగార్జున ఈ సందర్భంలో..  కొండా సురేఖ తన కుటుంబం పట్ల  దారుణంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ తన కొడుడు నాగచైతన్య, ఆయన మాజీ భార్య సమంతాపై చేసిన వ్యాఖ్యల పట్ల తాము ఎంతో మానసిక వేదనకు లోనైనట్లు తెలిపారు. కావాలని రాజకీయ దురుద్దేశంతోనే మంత్రిఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా నాగార్జున ధర్మాసనం ముందు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అన్ని టీడీ ఛానెల్స్ లో టెలికాస్ట్ అయ్యయని దీని వల్ల తన కుటుంబ గౌరవం మొత్తం దెబ్బతిందని కూడా ధర్మాసనం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  క్రమంలో నాంపల్లి కోర్టులో..కోర్టు వారు..మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ ఘటనలో గతంలో తమ ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకూడదంటే.. తమ మాజీ కొడల్ని పంపాలని కేటీఆర్ కొరారని అప్పుడు .. సమంతా ఒప్పుకొక పోవడంతో.. ఆమెకు తాము డైవర్స్ ఇచ్చినట్లు కూడా బాపు ఘాట్ పరిధిలో కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా నిరాధరమని, సత్యదూరమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల పట్ల తమ కుటుంబమంతా తీవ్ర మనోవేదనకు గురైనట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకొవాలని కూడా నాగార్జున కోర్టు వారిని కోరినట్లు తెలుస్తోంది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై.. సుప్రీయ సైతం...ఈ విధంగా ఒక మహిళ మంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Trending News