Kancharla: రిలీజ్‌కు సిద్ధమైన 'కంచర్ల'.. సాంగ్స్ షూటింగ్‌లో మూవీ యూనిట్ బిజీ

Kancharla Movie Updates: కంచర్ల హీరోగా.. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కంచర్ల. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం సాంగ్స్‌ చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 10:18 PM IST
Kancharla: రిలీజ్‌కు సిద్ధమైన 'కంచర్ల'.. సాంగ్స్ షూటింగ్‌లో మూవీ యూనిట్ బిజీ

Kancharla Movie Updates: సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్పూర్తినిచ్చే కథాంశంతో తెరకెక్కిన మూవీ కంచర్ల. కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ఎల్ఎస్ రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోందన్నారు. 

కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నామన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని.. భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఈ స్టోరీకి కమర్షియల్ అంశాలను మేళవించి.. ఆడియన్స్‌ను అలరింపజేసేలా డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

అనంతరం హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ.. ఇటీవల తాను యాక్ట్ చేసిన ఉపేంద్ర గాడి అడ్డా మూవీ ప్రేక్షకులను మెప్పించిందని.. ఈ సినిమా ద్వారా మరింత దగ్గరవుతానని నమ్మకంగా చెప్పగలనని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నాన్నతీస్తున్న ఇంకో చక్కటి మూవీ కంచర్ల అని అన్నారు. సామాజిక సృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలను చిత్రంలో పొందుపరిచినట్లు డైరెక్టర్ రెడ్డెం యాద కుమార్ తెలిపారు.

సుమన్, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, సుధ, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి, దువ్వాసి మోహన్, జబర్దస్త్ దొరబాబు, ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కుంచె రఘు సంగీతం అందివ్వగా.. సినిమాటోగ్రఫర్‌గా గుణశేఖర్ పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఎస్ఎఫ్ఎక్స్ స్టూడియో శ్యామ్ నిర్వర్తిస్తున్నారు. మాటలు ప్రసాదుల మధుబాబు రాశారు. కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత సహ నిర్మాతలుగా వ్యవహరించారు. 

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News