'నేల టిక్కెట్టు' మూవీ రివ్యూ

       

Last Updated : May 25, 2018, 03:02 PM IST
'నేల టిక్కెట్టు' మూవీ రివ్యూ

నటీనటులు : రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ, ప్రవీణ్, ప్రియదర్శి, పోసాని తదితరులు

ఛాయాగ్రహణం : ముకేశన్
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
నిర్మాణం :ఎస్.ఆర్. టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : రామ్ తాళ్ళూరి
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
విడుదల తేది : 25 మే 2018
సెన్సార్ : U/A
నిడివి: 166 నిమిషాలు

‘నేల టిక్కెట్టు’ అనే పదం చాలా క్యాచీగా ఉంది. అలాంటి టైటిల్ తో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో మాస్ & క్లాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ:
వైజాగ్ లో అనాథ(రవితేజ)గా ఉంటూ చుట్టూ జనం మధ్యలో మనం అనుకుంటూ వరుసపెట్టి పిలిస్తే వారి కోసం ఏదైనా చేసేస్తుంటాడు రవితేజ. ఈ క్రమంలో జనం కోసం కోర్టులో దొంగ సాక్ష్యాలు చెబుతూ పబ్బం గడిపేస్తున్న టైమ్ లో ఓ పోలీస్(జయప్రకాష్ రెడ్డి) వల్ల హైదరాబాద్ కు వస్తాడు. అలా హైదరాబాద్ వచ్చి మొదటి చూపులోనే డాక్టర్ చదువుతున్న (మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. తనను మెప్పించడం కోసం దొంగ డాక్టర్ గా అవతారమెత్తుతాడు. ఈ క్రమంలో డబ్బే ప్రాణం..నాదే జీవితం అనుకుంటూ తేడా వస్తే ఎవరి ప్రాణాన్నైనా తీసే హోమ్ మినిస్టర్ ఆదిత్య భూపతి(జగపతి బాబు)తో వైరం పెట్టుకుంటాడు. తన అక్రమాలకూ అడ్డుగా నిలిచే పనిని పెట్టుకుంటాడు. ఇంతకీ అనాధగా పెరిగిన వ్యక్తికి మంత్రి పదవిలో ఉన్న ఆదిత్య భూపతి కి సంబంధం ఏమిటి.. ఒక అనాథ ఎందుకు హోమ్ మినిస్టర్ తో శత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చింది… వీరిద్దరి రివేంజ్ డ్రామా ఏమిటి..అనేది మిగతా కథ.
నటీనటులు పనితీరు:

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తనకి పర్ఫెక్ట్ అనిపించే రోల్ తో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మాళవిక శర్మ తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు ప్లస్ అయ్యింది. జగపతి మరోసారి తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ వర్కౌట్ అవ్వలేదు. పృథ్వి కొంత వరకూ ఎంటర్టైన్ చేసాడు.. అలాగే అలీ, ప్రవీణ్, ప్రియదర్శి తమ కామెడి టైమింగ్ తో ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేసారు. ఇక పోసాని,రఘు బాబు , జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, జ్యోతి , సంపత్, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను, మధునందన్, ప్రియ, సుబ్బరాజు, అజయ్,కౌముది తదితరులు తమ పర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పనితీరు:

శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.. ముఖ్యంగా బాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసాడు శక్తికాంత్. ‘లవ్ యూ లవ్ యూ’, ఓసారి ట్రై చెయ్’,’నేల నేల టిక్కెట్టు అంటూ వచ్చే టైటిల్ సాంగ్స్ జస్ట్ పరవాలేదు అనిపించాయి. ముకేశన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ కొన్ని సీన్స్ లో అతని పనితనం చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సందర్భాల్లో కళ్యాణ్ కృష్ణ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘చుట్టూ జనం..మధ్యలో మనం’, ‘ముసలితనం అంటే చేతకాని తనం కాదురా నిలువెత్తు అనుభవం’ డైలాగ్స్ సినిమాలోని డెప్త్ తెలుపుతూ ఎంటర్ టైన్ చేసాయి. కళ్యాణ్ కృష్ణ సెలెక్ట్ చేసుకున్న కథ రొటీన్ అనిపించినా తన స్క్రీన్ ప్లే తో కొంత వరకూ ఎంటర్టైన్ చేయగలిగాడు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ న్యూస్ రివ్యూ:

బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తన మూడో సినిమా రవితేజతో చేస్తున్నాడనగానే ఈ ప్రాజెక్ట్ పై బజ్ నెలకొంది. కానీ రిలీజ్ కి ముందు విడుదల చేసిన ట్రైలర్… సాంగ్స్ మాత్రం సినిమాపై పెద్దగా అంచనాలు నెలకొల్పలేకపోయాయి. అదంతా పక్కన పడితే ఈ సినిమా కోసం చుట్టూ జనం మధ్యలో మనం అనే పాయింట్ సెలెక్ట్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ దాన్ని సరైన కథ గా మలచలేకపోయాడు. ఇక కథ స్క్రీన్ ప్లే రొటీన్ ఫార్మేట్ లో ఉండడంతో రవితేజ కూడా సినిమాను మోయలేకపోయాడు.
కామెడి..ఫ్యామిలీ ఎమోషన్..మెసేజ్..ఇలా అన్ని కలగలిపిన కథ కావడంతో దర్శకుడు తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ప్రారంభం నుండి మూస పద్ధతిలో కథను నడిపిస్తూ ఇంటరెస్ట్ కలిగించలేకపోయాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వచ్చే లాజిక్ లేని సీన్స్, సాంగ్స్, కెమెడీ చిరాకు తెప్పిస్తాయి. సినిమా అంతా ఆర్టిస్టులతో నింపేసిన దర్శకుడు వాళ్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు.
ఓవరాల్ గా చెప్పాలంటే సరైన కథ, కథనం లేని ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టు నేలటిక్కెట్టు ఆడియన్స్ ను కూడా తృప్తిపరచదు. రవితేజ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ తప్ప సినిమాలో పెద్దగా హైలైట్స్ కనిపించవు.
 

ప్లస్ పాయింట్స్ :

– రవితేజ
– బ్యాగ్రౌండ్ స్కోర్
– ఇంటర్వెల్ బ్లాక్
– ఎమోషనల్ సీన్స్
– డైలాగ్స్
 

మైనస్ పాయింట్స్

– కథ -స్క్రీన్ ప్లే
– ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్
– లాజిక్ లేని సీన్స్
– లవ్ ట్రాక్
 

రేటింగ్ : 2 /5

Trending News