ఓ బేబీ టీజర్... సింగర్ బేబీగా సమంత అక్కినేని

ఓ బేబీ టీజర్... సింగర్ బేబీగా సమంత అక్కినేని 

Last Updated : May 25, 2019, 11:55 PM IST
ఓ బేబీ టీజర్... సింగర్ బేబీగా సమంత అక్కినేని

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ బేబీ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. బివి నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేశ్, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ ఫస్ట్ లుక్‌కి భారీ స్పందన కనిపించగా తాజాగా విడుదలైన టీజర్‌కి సైతం అంతే స్పందన లభిస్తోంది. మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు ఓ బేబి తెలుగు రీమేక్ వెర్షన్. ఈ సినిమాలో సమంత ఓ సింగర్‌గా కనిపించనుంది.

సినిమా టీజర్‌ని చూస్తే ఓ బేబి సినిమాలో కడుపుబ్బా కామెడి ఉంటుందనే అనిపిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో నందిని రెడ్డి ప్రయోగాలు బెడిసికొడుతున్న నేపథ్యంలో ఓ కొరియన్ మూవీ ఆధారంగా ఆమె చేసిన లేటెస్ట్ ప్రయోగం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అయితే, అంతకన్నా ముందుగా ఈ కామెడీ టీజర్ పై ఓ లుక్కేయండి.

Trending News