7-day Protein Diet Plan: బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి అని తరుచుగా అన్వేషిస్తున్నాం. అయితే బరువు తగ్గించే ఆహారంలో ప్రోటీన్ కీలకమైన ప్రాత పోషిస్తుంది. ప్రోటీన్ బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుంది అనే ఆంశంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
✴ ప్రోటీన్ -బరువు కనెక్షన్: ప్రోటీన్ అనేది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే కీలకమైన మాక్రోన్యూట్రియెంట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు తీసుకోనే ఆహారంలో 18-30 శాతం ప్రోటీన్ ఉండాని. కార్బోహైడ్రేట్లు , కొవ్వు, తక్కువ తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. అయితే దీనిని ఎలా మన ప్రతిరోజు తీసుకోవాలి అనే దానికిపై మనం తెలుసుకుందాం.
✴ బరువు తగ్గడం కోసం 7-రోజుల ప్రోటీన్ డైట్ ప్లాన్....
బరువు తగ్గడానికి 7-రోజుల ప్రోటీన్ డైట్ ప్లాన్ మీకు సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ లో మొత్తం రోజువారీ కేలరీలలో 20 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్ల, 20-25 శాతం కొవ్వు గురించి చెప్పతుంది.
✴ డే-1 ప్లాన్:
ఉదయం: నానబెట్టిన బాదం, రెండు నానబెట్టిన వాల్‌నట్‌లు
టిఫిన్: వేరుశెనగలు, ఉడికించిన ఎగ్, పోహా
లంచ్: స్ప్రౌట్ సలాడ్ 1 కప్పు, గోధుమ చపాతీ, మేతి పాలక్ కూర, రైతా
సాయంత్రం: ఒక గ్లాస్ పానీయం
డిన్నర్: కెన్ బ్రౌన్ రైస్, కాల్చిన కూరగాయలు, పెరుగు
రాత్రి: ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్
✴ డే- 2 ప్లాన్:
ఉదయం: నాలుగు నానబెట్టిన బాదంపప్పులతో నిమ్మకాయ రసం
టిఫిన్: ఎగ్ పరాటా, గ్రీన్ చట్నీ, మజ్జిగ
లంచ్: జొన్న రోటీ, చికెన్ కర్రీ, వెజ్జీ సలాడ్
సాయంత్రం: ఉడికించిన చనా మసాలా చాట్
డిన్నర్: గ్రిల్డ్ టోఫు, టమోటా సూప్‌తో వేయించిన కూరగాయలు
రాత్రి: ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్
✴ డే- 3 ప్లాన్:
ఉదయం: నానబెట్టిన ఎండుద్రాక్ష
టిఫిన్: కూరగాయలతో కూడిన గోధుమ ఉప్మా
లంచ్: పనీర్ భుర్జీ, చపాతీ, చనా సలాడ్,మజ్జిగ
సాయంత్ర: వేరుశెనగ వెన్న, ఒక ఆపిల్
డిన్నర్: మూంగ్ పప్పు, కాల్చిన టోఫుతో బ్రౌన్ రైస్
రాత్రి: ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్
✴ డే- 4 ప్లాన్:
ఉదయం: నానబెట్టిన వాల్‌నట్, బాదం
టిఫిన్: గుడ్డు, శాండ్‌విచ్, చియా పుడ్డింగ్
లంచ్: చపాతీ, వెజిటబుల్ రైటా, చేపల కూర
సాయంత్రం: సత్తు మజ్జిగ
డిన్నర్: కూరగాయలు,చికెన్, తక్కువ కొవ్వు ఉన్న పనీర్
రాత్రి: ఒక గ్లాస్ పసుపు పాలు
Also read: Turnip For Weight Loss: టర్నిప్‌తో వెయిట్ లాస్ అవ్వడం సులభం..1 వారంలోనే మంచి ఫలితాలు!
✴ డే- 5 ప్లాన్:
ఉదయం: చియా సీడ్ లెమన్ వాటర్
టిఫిన్: మల్టీగ్రెయిన్ బ్రెడ్‌తో వెజిటబుల్ బేసన్ చీలా
లంచ్: చపాతీ, మిక్స్‌డ్ వెజ్ సబ్జీ, మజ్జిగ
సాయంత్రం: పండ్లు, గింజల, పెరుగు
డిన్నర్: మిల్లెట్ ఖిచ్డీతో వేయించిన పచ్చి వెజ్
రాత్రి: ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్
✴ డే- 6 ప్లాన్:
ఉదయం: నానబెట్టిన ఎండుద్రాక్ష
టిఫిన్: సాంబార్,కొబ్బరి చట్నీతో మిల్లెట్ ఇడ్లీ
లంచ్: చపాతీ, సత్తు మజ్జిగ, ఎగ్ కర్రీ
సాయంత్రం: కాల్చిన మఖానా
డిన్నర్: కూరగాయలు, చికెన్ టాకో
రాత్రి: ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్
✴ డే- 7 ప్లాన్:
ఉదయం: నిమ్మకాయ వాటర్
టిఫిన్: వెజిటబుల్ ఉప్మా
లంచ్: చపాతీ, పెరుగు, పనీర్ సలాడ్, చికెన్ కీమా
సాయంత్రం: వేరుశెనగ, చనా భెల్
డిన్నర్: టొమాటో సూప్‌తో బజ్రా రోటీ
రాత్రి: పాలతో డ్రై ఫ్రూట్స్
ఈ 7-రోజుల ప్రొటీన్ డైట్ ప్లాన్ ను తు చ తప్పకుండా పాటించడం వల్ల సువులుగా మీరు అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి