Natural Hair Oil: జుట్టు సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు చాలా సాధారణం. ఈ సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కొంతమంది మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. కానీ ఎలా ప్రొడెక్ట్స్ తో పనిలేకుండా ఇంట్లోనే సహజంగా నూనెను తయారు చేసుకోవచ్చు.
అలోవెరా, కొబ్బరి నూనె రెండూ జుట్టుకు అద్భుతమైన లాభాలను అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు సంబంధిత అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలోవెరా, కొబ్బరి నూనె లాభాలు:
అలోవెరా, కొబ్బరి నూనెలు చర్మం, జుట్టు సంరక్షణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సహజ పదార్థాలు. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచి, జుట్టును బలంగా మారుస్తాయి. అలోవెరా జుట్టును సంరక్షిస్తుంది. ఇది చండ్రు, జుట్టు రాలడం వంటి తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కొబ్బరి నూనె కూడా జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి నూనె జుట్టును బలంగా మారుస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గిస్తుంది. అలోవెరా, కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్
కావలసినవి:
అలోవెరా జెల్ (తెల్ల భాగం) - 2-3 స్పూన్లు
కొబ్బరి నూనె - 1-2 స్పూన్లు
తయారీ విధానం
ఒక బౌల్‌లో అలోవెరా జెల్, కొబ్బరి నూనెను బాగా కలపండి. తేనె జుట్టుకు మృదుత్వం ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని మీ తలకు మసాజ్ చేయండి.
జుట్టు మొత్తానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి, తర్వాత మిల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి.
ముఖ్యమైన విషయాలు:
ఈ హెయిర్ ప్యాక్‌ను వారానికి 2-3 సార్లు వాడవచ్చు.
అలర్జీ ఉంటే ఈ ప్యాక్‌ను వాడకండి.
ఈ హెయిర్ ప్యాక్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, ఒక వారం వరకు ఉపయోగించవచ్చు.
అదనపు సూచనలు:
ఈ హెయిర్ ప్యాక్‌కు బదులుగా, మీరు అలోవెరా జెల్‌ను నేరుగా మీ తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడుక్కోవచ్చు.
కొబ్బరి నూనెను రాత్రి పూట మీ తలకు మసాజ్ చేసి ఉదయం కడుక్కోవచ్చు.
జుట్టు రకం, సమస్యలను బట్టి ఈ ప్యాక్‌ను మార్చవచ్చు. ఉదాహరణకు, జుట్టు చాలా పొడిగా ఉంటే, మీరు కొబ్బరి నూనె పరిమాణాన్ని పెంచవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.