Amaranth Leaves Benefits: ఆకు కూరల్లో ఎన్నో పోషకాలిగిన కూర తోటకూర. ఇందులో శరీరానికి కావాల్సిన బోలుడు పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఔషధ గుణాలు కలిగిన మూలకాలు కూడా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆకు కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని వైద్యులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పరిగణిస్తారు. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
2. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
తోటకూరలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందని పోషక నిపుణులు తెలుపుతున్నారు. ఇది మలబద్ధకాన్ని తగ్గించి అనేక జీర్ణక్రియ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
3. రక్తహీనతను నివారిస్తుంది:
తోటకూరలో ఐరన్ అధికంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రక్తహీనతను నివారణకు సహాయపడుతుంది. ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన మూలకాలను అందించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు పిల్లల్లో రక్తహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ తోటకూరను ఆహారాల్లో ఇవ్వాల్సి ఉంటుంది.
4. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
తోటకూరలో కాల్షియంతో పాటు విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ కె ఎముకల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్‌లను అందించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
5. కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది:
తోటకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుంది. దీంతో పాటు ఇందులో ఉండే విటమిన్ ఎ రే చికటిని నియంత్రించి, మాక్యులర్ డెజెనరేషన్ వంటి వయస్సు-సంబంధిత కంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆకు కూరను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి