Diabetes Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు చేసే ఆ పొరపాట్లు..బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి

Diabetes Health Tips: మధుమేహం అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ భారీగా పెరుగుతుంటాయి. ఈ క్రమంలో డయాబెటిస్ రోగులు చేయకూడని ఆ పొరపాట్లేవో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2022, 04:21 PM IST
Diabetes Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు చేసే ఆ పొరపాట్లు..బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి

మధుమేహం ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా ఎదురౌతున్న సమస్య. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కానుంది. అందుకే డయాబెటిస్ రోగులు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండాలి.  మధుమేహం ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం..

మధుమేహానికి నియంత్రణే తప్ప పూర్తి చికిత్స లేదు. అందుకే ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే కిడ్నీ, గుండె, కంటి సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మనం తినే ఆహార పదార్ధాల ప్రభావం నేరుగా మన శరీరంపై పడుతుంటుంది. డయాబెటిస్ రోగులు చేసే కొన్ని తప్పుల కారణంగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఆ వివరాలు మీ కోసం..

డయాబెటిస్ రోగులు చేయకూడని తప్పులు

అధిక కార్బోహైడ్రేట్లు, లో ప్రోటీన్లు
 
కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌లో సరైన ఆహారం తీసుకోరు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ తక్కువ కార్బోహైడ్రేట్లు, లో ప్రోటీన్లు ఉండే పదార్ధాలు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు

కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయేమోనని ఆందోళన చెందుతుంటారు. కానీ ఆ పరిస్థితి ఉండదు. డయాబెటిస్ రోగులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఎగ్స్, పాలు, మసూర్ దాల్, పాలకూర వంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్లు లేకపోతే శరీరం అసంపూర్తిగా ఉంటుంది.

జ్యూస్ తాగడం

ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్ రూపంలో జ్యూస్ తాగుతుంటారు. కానీ జ్యూస్ తాగినప్పుడు అందులో ఫైబర్ లేకపోవడం వల్ల స్థూలకాయం సమస్యగా మారుతుంది. అదే సమయంలో కొన్ని రకాల జ్యూస్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. అందుకే జ్యూస్ స్థానంలో పండ్లు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

Also read; Black Raisins Benefits: ఎండుద్రాక్షతో అధిక బరువు, జీర్ణక్రియ సమస్యలన్నీ చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News