Diabetes Reduction Diet: భారతదేశంలో అన్ని వయసుల వారు మధుమేహంతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారంతో పాటు బిజీ లైఫ్ లో ఒత్తిళ్ల కారణంగా ఈ వ్యాధి ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. మధుమేహం అనేక ఇతర వ్యాధులకు మూలం, కాబట్టి రోగులు వారి శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే భవిష్యత్ లో అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన హెల్తీ ఫుడ్
1) దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ఇన్సులిన్ చర్యను ప్రేరేపిస్తుంది. రక్తంలో దానిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
2) వేప
వేపలో గ్లైకోసైడ్లు, ట్రైటెర్పెనాయిడ్స్ ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది.
3) పసుపు
పసుపులో కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది డయాబెటిస్ వ్యాధికారకలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
4) కాకరకాయ
కాకర కాయ తినేందుకు కాస్త చేదుగా ఉన్నా.. అందులోని కెరాటిన్, మోమోర్డిసిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలోని చక్కెర స్థాయి పెరుగుదలను నివారిస్తుంది.
5) అల్లం
శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
6) టమోటాలు
టొమాటో విటమిన్-సి కి గొప్ప మూలంగా పరిగణిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
7) మెంతి గింజలు
మెంతికూరలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరుస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమచారం నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలు ఆధారంగా రూపొందించింది. వీటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచింది. ZEE తెలుగు News దీన్ని ధ్రువీకరించడం లేదు.)
Also Read: Almond Milk Benefits: బాదంపాలు తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Also Read: Dark Circles Prevention Tips: కళ్ల కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తికి ఈ చిట్కాలు వాడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.