Food For Heart Patient: బీన్స్, బాదంపప్పును ఇలా తీసుకుంటే.. ఈ జన్మలో గుండె పోటు రాదు..

Food For Heart Patient: ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 01:05 PM IST
  • గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారా..
  • బీన్స్, బాదంపప్పును తీసుకోండి
  • ఇలా చేస్తే జీర్ణక్రియ సమస్యలు కూడా తొలగిపోతాయి
Food For Heart Patient: బీన్స్, బాదంపప్పును ఇలా తీసుకుంటే.. ఈ జన్మలో గుండె పోటు రాదు..

Food For Heart Patient: ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే గుండెపోటు సమస్యలు, రక్తనాళాలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంపై, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా దూరం అవుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉండే ఆరోగ్యంగా ఉండడానికి వీటిని ఆహారంగా తీసుకోండి:

కూరగాయలు, ఆకుకూరలు:
క్రమం తప్పకుండా కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల పోషక విలువలు అందుతాయి. ముఖ్యంగా బచ్చలి కూర వంటి ఆకుకూరలు పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

పండ్లు:
పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. ముఖ్యంగా స్ట్రాబెరీలు, బ్లూబెర్రీలు గుండె సమస్యలపై ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు గుండె సమస్యలు రాకుండా సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణం అధికంగా ఉంటుంది. వాపులు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బీన్స్:
బీన్స్ ను ప్రస్తుతం ఆహారంలో భాగంగా స్టార్టర్స్ లో కూడా వినియోగిస్తున్నారు. ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీరం యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి ఇవి ఔషధం అని చెప్పొచ్చు.

బాదంపప్పు:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి బాదాం పప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్లు మినరల్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. ముఖ్యంగా ముఖ్యంగా గుండెపోటున్న వారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News