Gargling and Covid-19: మౌత్ వాష్ చేస్తే వైరస్ లోడ్ తగ్గుతుంది...కొత్త అధ్యయనం

కరోనావైరస్ ( Coronavirus ) ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అని ఒక అద్యయనంలో తేలింది. జెర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్-19 ( Covid-19) వైరస్ కారణం అయ్యే కోవ్-2 ( SARS-Cov-2) ను డియాక్టివేట్ చేస్తుందట.

Last Updated : Aug 12, 2020, 10:39 AM IST
Gargling and Covid-19: మౌత్ వాష్ చేస్తే వైరస్ లోడ్ తగ్గుతుంది...కొత్త అధ్యయనం

కరోనావైరస్ ( Coronavirus ) ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అని ఒక అద్యయనంలో తేలింది. జెర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్-19 ( Covid-19) వైరస్ కారణం అయ్యే సార్స్ కోవ్-2 ( SARS-Cov-2) ను డియాక్టివేట్ చేస్తుందట. వైరల్ లోడ్ ను తగ్గించడానికి మౌత్ వాష్  చేస్తే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతం అవుతుంది అని.. దాంతో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు.

జర్మనీలో అందుబాటులో ఉన్న ఆ మౌత్ వాష్  ప్రోడక్ట్ లో ( Mouth wash Products ) ఉన్న వివిధ ఇంగ్రీడింట్స్ వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది అంటున్నారు. పరిశోధకులు ల్యాబ్ లో వివిధ వైరస్ లతో మౌత్ వాష్ లను ప్రయోగించగా..ఫలితం కనిపించింది అన్నారు. మౌత్ వాష్ మిక్స్ ను దాదాపు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించారట.

జర్మనీలో ప్రచురితం అయిన జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ లో ( Journal Of Infectious Diseases ) వెల్లడి అయిన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాం అని.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Trending News