High Blood Sugar Control: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక జీవన శైలి కారణంగా 100 మందిలో 70 మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అందులో 40 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులో చాలామంది అతి చిన్న వయసులోనే మధుమేహం సమస్యతో బాధపడుతున్నారని తెలిపాయి. మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా డైట్ పద్ధతిలో ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. నిజానికి మధుమేహం ఉన్న వారిలో ఆ చక్కెర స్థాయిలో అదుపులో ఉండడం చాలా మేలు. ఇవి అదుపులో లేకపోవడం కారణంగా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారిలో చక్కెర స్థాయిలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొంతమందిలో ఆహారాలు తీసుకున్న వెంటనే రక్తంలోని చక్కర స్థాయిలో పెరుగుతూ ఉంటాయి. ఇవి అదుపులో ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఔషధాలను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆయుర్వేద గుణాలు కలిగిన ఆకులను తీసుకోవడం వల్ల కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవచ్చు.
మధుమేహం ఉన్నవారికి రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా నియంత్రించుకోవడానికి ప్రతిరోజు ఉదయం పూట మారేడు కాయ ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మారేడు ఆకుల్లో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాలు అదుపులోకి వస్తాయి. మారేడు ఆకులను ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కలుపుతూ తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే కొన్ని ఔషధ గుణాలు మలబద్ధకం ఇతర పుట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ప్రతిరోజు ఉదయం పూట మారేడు ఆకులను నమిలి తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం పూట మూడు నుంచి నాలుగు మారేడు ఆకులను నమిలి తినాల్సి ఉంటుంది. ఇలా చేస్తే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా మారేడు ఆకులను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి