High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి ఇదే సులభమైన చిట్కా...

High Cholesterol Control In 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 09:43 AM IST
  • చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారా..
  • అయితే రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
  • అంతేకాకుండా సోయాబీన్ ఆహారంలో తీసుకోండి.
High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి ఇదే సులభమైన చిట్కా...

High Cholesterol Control In 7 Days: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల తీవ్ర గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గుండెలో సిరలలో కొవ్వు నిండి గుండె పోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే గుండె సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండెపోటు వస్తుందని ఇటీవలే నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి శరీరంలో కొవ్వులను తగ్గించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు:
చెడు కొలెస్ట్రాల్‌ను నుంచి ఉపశమనం పొందడానికి ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందడమేకాకుండా శరీరం దృఢంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  కావాలంటే వీటిని పాలలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్:
అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి డ్రై ఫ్రూట్స్ ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకునేందుకు  జీడిపప్పు, వాల్నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో చాలా పీచు లభిస్తుంది. ప్రోటీన్లు అవసరమైన పోషకాలు వాటిలో ఉంటాయి.

యాపిల్:
యాపిల్‌లో శరీరానికి లభించే పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల  ఆరోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్ సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.

సోయాబీన్:
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావంవతంగా కృషి చేస్తుంది. టోఫు, సోయా మిల్క్  అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. సులభంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించుకోవడానికి తప్పకుండా సోయాబీన్స్‌ తీసుకోండి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా (వీడియో)! 

Also Read: Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా (వీడియో)! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News