Home remedies for Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఎక్కువ మందిని వేధిస్తోంది. ఇది అధికంగా ఫాస్ట్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఫ్యాటీ లివర్ కు చికిత్స ఉన్న సత్వర నివారణ చర్యలు కూడా అవసరం. ఈరోజు మనం ఇంటి వస్తువులతో ఫ్యాటీ లివర్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.
పసుపు..
పసుపు మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు లివర్ వాపును తగ్గిస్తాయి. పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.
అల్లం..
అల్లం కూడా ఏళ్లుగా సాంప్రదాయ మందుల్లో వినియోగిస్తారు. అల్లంలో జింజోరల్, షాగోవల్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూడవచ్చు. శరీరంలో విషపదార్థాలు పేరుకోకుండా లివర్ ను క్లీన్ చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ ఒక నాలుగు గ్రాముల అల్లం తీసుకోవచ్చు. ఇది రక్తాన్ని పలుచగా కూడా చేస్తుంది.
పాలకూర..
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఈ మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకు ఒక కప్పు పాలకూర తీసుకోవడం మేలు. పాలకూరలో ఆక్సలేట్స్ ఉంటాయి. దీన్ని అతిగా తీసుకోవడం వల్ల కడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.
ఇదీ చదవండి: పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి డైట్లో ఈ 5 ఆహారాలు ఉండాల్సిందే..
బొప్పాయి..
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. బొప్పాయిలో విటమిన్ సీ ఉంటుంది. ఇవి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. బొప్పాయి లివర్ స్ట్రెస్, వాపు సమస్యలకు చెక్ పెడుతుంది.
నిమ్మకాయ..
నిమ్మకాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయాన్ని డిటాక్సిఫై చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు పంపుతాయి.
బీట్‌రూట్..
బీటలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. బీట్‌రూట్ లో బీటైన్ లివర్ ఫ్యాట్స్ కట్ చేస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: మీరు టాయిలెట్‌లో ఎక్కువసేపు గడిపితే ఈ ప్రతికూలతలు తెలుసుకోండి
వాల్నట్స్..
ఆరోగ్యకరమైన కాలేయానికి ప్రతిరోజూ ఒక వాల్నట్ తీసుకోండి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్‌లో మెగ్నిషియం, విటమిన్ ఇ ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. ఒక కప్పు వాల్నట్స్ తింటే కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook