Kakarakaya Hair Oil: కాకరకాయ హెయిర్ ఆయిల్ ప్రతిరోజు వాడుతే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది

Kakarakaya Hair Oil Helath Benefits: చర్మ సంరక్షణలో కూడా ఎంతో  ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసే నూనె శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 11, 2024, 02:55 PM IST
Kakarakaya Hair Oil: కాకరకాయ హెయిర్ ఆయిల్ ప్రతిరోజు వాడుతే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది

Kakarakaya Hair Oil Helath Benefits: కరేలా ఆయిల్ అంటే కాకరకాయ నుంచి తీసిన నూనె. కాకరకాయ ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. అదేవిధంగా, కరేలా ఆయిల్ కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.  దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలను ఉపయోగించుకునేందుకు కాకరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడమే కాకుండా, దీని నుంచి తీసిన నూనెను కూడా చర్మం ,జుట్టు సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. అయితే కరేలా ఆయిల్ గురించి అంతగా తెలియని వారి కోసం, దీని లాభాలను వివరంగా తెలుసుకుందాం.

జుట్టుకు సంబంధించిన లాభాలు:

కరేలా ఉపయోగించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇది జుట్టును ఒత్తుగా, బలంగా చేస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యలతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతాయి. దీని ప్రతిరోజు ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఆయిల్ జుట్టును లోతుగా పోషిస్తుంది, దీంతో జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.

చర్మానికి సంబంధించిన లాభాలు:

కరేలాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై కలిగే మొటిమలను, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని తేమగా ఉంచడంలో మేలు చేస్తుంది. కరేలా ఆయిల్ చర్మాన్ని మృదువుగా  కాంతివంతంగా చేస్తుంది.

ఈ కరేలా నూనెను కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలేయం కొవ్వును తగ్గిస్తుంది.

కరేలా నూనె ఎలా ఉపయోగించాలి:

చర్మం కోసం: కరేలా నూనెను నేరుగా చర్మంపై అప్లై చేయండి లేదా ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులతో కలపండి.

జుట్టు కోసం: కరేలా నూనెను తలకు మర్దన చేసి, కొన్ని గంటలు వదిలివేసి, ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేయండి.

ఆహారంగా: కరేలా నూనెను చిన్న మొత్తంలో ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి. 

గమనిక:

కరేలా ఆయిల్‌ను ఉపయోగించే ముందు, మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, మీ వైద్యునితో సంప్రదించడం మంచిది.

Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News