Papaya On Empty Stomach: బొప్పాయిలో విటమిన్ సీ ఉంటుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు. అయితే, పరగడుపున తింటే వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. అవేంటో తెసుకుందాం.
డైజెస్టీవ్ ఎంజైమ్..
బొప్పాయిలో పపైన్, కైమోపపైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. పరగడుపున బొప్పాయి తింటే ఎంజైమ్స్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.
ఇమ్యూనిటీ..
బొప్పాయిలో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పరగడుపున తీసుకుంటే ఎంతో మంచివి. విటమిన్ సీ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిపెరుగుతుంది.
బరువు నిర్వహణ..
బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. పరగడుపున బొప్పాయి తింటే కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.
స్కిన్ హెల్త్..
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. దీంతో ముఖం మెరిసిపోతుంది. పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల మీ ముఖ రంగు కూడా మెరుగవుతుంది.
డిటాక్సిఫికేషన్..
బొప్పాయిలో డైటరీ ఫైబర్, ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది నేచురల్ డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. పరగడుపున బొప్పాయిని తినడం వల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.
ఇదీ చదవండి: వేసవిలో పిల్లలకు ఈ 4 డ్రింక్స్ కచ్చితంగా ఇవ్వండి.. వడదెబ్బకు గురికాకుండా కాపాడతాయి..
మలబద్ధకం..
మలబద్ధకం సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడేవారికి కూడా బొప్పాయి మంచిది. ఇందులోని ఫైబర్ కంటెంట్, డైజెస్టివ్ ఎంజైమ్ నేచురల్ గా మలబద్ధకం సమస్యకు రెమిడీగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం..
బొప్పాయిలో పొటాషియం కావాల్సిన మినరల్స్ ఉంటాయి. ఇది బీపీ, కార్డియోవాస్క్యూలర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం బొప్పాయిని తసీఉకోవడం వల్ల బీపీ లెవల్స్ అదుపులో ఉంచి గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
న్యూట్రియేంట్..
బొప్పాయిలో న్యూట్రియేంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సీ, పొటాషియంతోపాటు విటమిన్ ఏ, ఇ, కే, బీ మినరల్స్ ఉంటాయి.
ఇదీ చదవండి: ఈ 5 జ్యూసులు తాగండి.. మీరు బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదట..
కంటి చూపు..
బొప్పాయిలోని బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. కంటి సంబంధిత సమస్యలను నివారిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter