Thane Incident: 100 అడుగుల ఎత్తు నుంచి పడిన గిర్నార్ యంత్రం.. 14 మంది దుర్మరణం..

Maharashtra: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. గిర్డర్‌ యంత్రం కుప్పకూలి 14 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని షాపూర్‌లో జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2023, 07:45 AM IST
Thane Incident: 100 అడుగుల ఎత్తు నుంచి పడిన గిర్నార్ యంత్రం.. 14 మంది దుర్మరణం..

Thane Incident: మహారాష్ట్రలోని థానే ఘోర ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రం కుప్పకూలిన ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్-3 పనుల్లో భాగంగా.. థానే జిల్లాలోని షాపుర్ మండలంలోని సర్లాంబే గ్రామ సమీపంలో ఓ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇందులో గిర్డర్ మోసే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్‌ యంత్రం కార్మికులపై పడింది. ఇది సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 14 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతులను, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Also Read: RPF Jawan Fire: ట్రైన్‌లో ఆర్‌పీఎఫ్‌ జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News