2023 G20 Summit: భారదదేశం లీడ్ చేస్తున్న జీ20 దేశాల సమాఖ్యకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఒక్కొక్క ఏడాది ఒక్కో దేశం ఏడాది పాటు జీ20 సదస్సును నిర్వహించడమే కాకుండా..పూర్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది. ఈ ఏడాది 2023 జీ20 సదస్సు సారధ్య బాధ్యతలు ఇండియాకు దక్కాయి.
2023 జీ20 సదస్సు సెప్టెంబర్ నెలలో ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇందులో భాగంగా 50 ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జీ20 సన్నాహక సదస్సులు బెంగళూరు, చండీగడ్, చెన్నై, గువహతి, ఇండోర్, జోథ్‌పూర్, ఖజురహో, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌లో జరిగాయి.
మార్చ్ 28న విశాఖపట్నంలో జీ20 సదస్సు
2023 జీ20 సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో మార్చ్ 28న జీ20 సదస్సుకు ఏపీ ప్రభుత్వం ఆతిద్యమిస్తోంది. జీ20 దేశాల సదస్సుకై ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ20 సదస్సుకు 2500 మంది పోలీసుల్ని మొహరించనున్నారు. ఇందులో 1850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ దళాలు, 2 క్యూఆర్టీ టీమ్స్, 6 ప్రత్యేక పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లు ఉన్నాయి. జీ20 సదస్సు నేపధ్యంలో విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్ని సుందరంగా అలంకరించారు. నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రదేశాలకు రేపు స్థానికులకు అనుమతి లేదు.
జీ20 అంటే ఏమిటి
జీ20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని అర్ధం. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యూఎస్ఏ దేశాలున్నాయి.
ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 దేశాలే కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ20 దేశాలదే కావడం విశేషం.
జీ20 ఆవిర్భావం, లక్ష్యాలు ఇలా
1990 దశకంలో వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాలు, ప్రపంచ ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని దేశాలకు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో జీ20 ఏర్పాటు ఆవశ్యకమైంది.
1. గ్లోబల్ ఎకానమిక్ స్టెబిలిటీ, సస్టెయినిబిలిటీ సాధించేందుకు సభ్య దేశాల మధ్య విధానాలపై సమన్వయం ఉండేట్టు చూడటం.
2. నష్టాల్ని తగ్గించేందుకు, ఆర్ధిక సంక్షోభాల్ని నిరోధించేందుకు ఆర్ధిక నిబంధనల్ని ప్రోత్సహించడం
3. నూతన అంతర్జాతీయ ఆర్ధిక ప్రణాళిక రూపొందించడం
ఇండియాకు 2023 జీ20 అధ్యక్ష బాధ్యతలు
జీ20 సదస్సులు 2008 నుంచి వరుసగా జరుగుతున్నాయి. మొట్టమొదటి జీ20 సదస్సును యూఎస్ఏ చేపట్టగా రెండవ సదస్సును యూకే నిర్వహించింది. 2022లో జీ20 సదస్సును ఇండోనేషియా లీడ్ చేసింది. 2023లో అంటే ఈ ఏడాది ఇండియా అధ్యక్షత వహిస్తోంది. వచ్చే ఏడాది 2024లో బ్రెజిల్ జీ20 అధ్యక్షత వహించనుంది.
వసుదైక కుటుంబం థీమ్‌తో ఇండియా 2023 జీ20 సదస్సు నిర్వహిస్తోంది. అంటే One Earth, One Family, One Future అని అర్ధం.
Also read: Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook