7th Pay Commission Latest Update: డియర్నెస్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం త్వరలో వెలువడనుంది. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచగా.. రెండో డీఏ కూడా 4 శాతమే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఏప్రిల్ నెలకు సంబంధించి ఏఐసీపీఐ సూచీ డేటా విడుదలవ్వగా.. ఇండెక్స్ గణాంకాల్లో పెరుగుదల కనిపించిన విషయం తెలిసిందే. దీంతో రెండో డీఏ కూడా నాలుగు శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 42 శాతం డీఏను ఉద్యోగులు అందుకుంటున్నారు. 4 శాతం పెంచితే 46 శాతానికి చేరుతుంది. డీఏ పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది.
ప్రస్తుతం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ నెలకు రూ. 18 వేలు అయితే.. 42 శాతం డీఏ లెక్కిస్తే.. అది రూ.7,560 అవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం మరో 4 శాతం డీఏ పెరిగితే.. 46 శాతం ప్రకారం రూ.8,280 అవుతుంది. ఏడాదికి మొత్తం రూ. 99,360 పెరుగుతుంది. డీఏ పెంచితే.. 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి నెల నుంచి వర్తింపజేశారు. రెండో డీఏను జూలై నుంచి వర్తింపజేస్తారు.
రెండో డీఏ నాలుగు శాతం పెరిగే అవకాశం ఉన్నా.. మే, జూన్ ఏఐసీపీఐ డేటాపై ఆధారపడి ఉంటుంది. మార్చిలో ఇండెక్స్ డేటా 133.3 పాయింట్ల వద్ద ఉండగా.. ఏప్రిల్ నెలలో 0.72 పాయింట్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం 134.02 పాయింట్లకు చేరుకుంది. మే, జూన్ నెలలో కూడా ఏఐసీపీఐ ఇండెక్స్ పాయింట్లలో పెరుగుద ఉంటే.. అందరూ అంచనా వేసినట్లే 4 శాతం డీఏ పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు జీతాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మొదటి డీఏ సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల మధ్యలో ఉంటుంది. రెండు డీఏ ఆగస్టు-సెప్టెంబర్ నెలల మధ్య ఉండే అవకాశం ఉంది.
Also Read: Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి భారీ రిక్రూట్మెంట్.. దరఖాస్తు వివరాలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి