AIADMK Celebrations: రెండుగా చీలిన పార్టీ కేడర్, తమిళనాట మారుతున్న పరిణామాలు

AIADMK Celebrations: ఏఐఏడీఎంకే స్వర్ణోత్సవాలు ఆ పార్టీలో చీలికను తీసుకొచ్చేట్టు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ రీఎంట్రీ కలకలం రేపుతూ పార్టీ కేడర్‌ని రెండు వర్గాలుగా చీల్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ చెప్పడం మారుతున్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2021, 03:05 PM IST
  • ఏఐఏడీఎంకే పార్టీ స్వర్ణోత్సవ వేడుకల్లో రెండుగా చీలిన పార్టీ కేడర్
  • పార్టీ ప్రధాన కార్యదర్శి తానేనని ప్రకటించుకున్న శశికళ
  • కోర్టు ధిక్కరణ చర్య అంటున్న అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్
AIADMK Celebrations: రెండుగా చీలిన పార్టీ కేడర్, తమిళనాట మారుతున్న పరిణామాలు

AIADMK Celebrations: ఏఐఏడీఎంకే స్వర్ణోత్సవాలు ఆ పార్టీలో చీలికను తీసుకొచ్చేట్టు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ రీఎంట్రీ కలకలం రేపుతూ పార్టీ కేడర్‌ని రెండు వర్గాలుగా చీల్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ చెప్పడం మారుతున్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది. 

తమిళనాడులో(Tamilnadu)రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం అన్నాడీఎంకేలో ఆందోళన మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)నెచ్చెలిగా, చిన్నమ్మగా ఉన్న శశికళ పొలిటికల్ రీఎంట్రీ పెను దుమారమే లేపుతోంది. ఆ పార్టీ స్వర్ణోత్సవ వేడుకలు ఇందుకు వేదికగా మారాయి. పార్టీ స్వర్ణోత్సవ వేడుకల(AIADMK 50 Years Celebrations)శిలాఫలకంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరుండటం వివాదానికి దారి తీసింది. ఏఐఏడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. పన్నీరు సెల్వమ్, పళనిస్వామి(Palaniswamy)నేతృత్వంలో ఓ సమన్వయ కమిటీ ఏర్పడితే..శశికళ నేతృత్వంలో మరో కమిటీ ఏర్పడింది. దాంతో పార్టీ కేడర్ రెండుగా విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధుల్ని సందర్శించి నివాళులర్పించిన శశికళ(Sasikala)..పార్టీకు తానే ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకోవడంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. 

పన్నీరు సెల్వమ్(Panneer Selvam), పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే (AIADMK)సమన్వయ కమిటీ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. అటు శశికళ నేతృత్వంలో ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు జరిగాయి. అంతేకాకుండా అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారులో ఆమె ప్రయాణిచారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి..ఆయన కుటుంబసభ్యులతో కాస్సేపు గడిపారు. అందరూ ఏకమై..పార్టీని గెలిపిద్దామని శశికళ పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలితలు తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని..ఆ వైభవం తిరిగి రావాలంటే అందరూ ఒక్కటవ్వాలని స్పష్టం చేశారు. గతంలో సమస్యలున్నా పార్టీకి చెందినవారినే ప్రభుత్వంలో కూర్చోబెట్టామంటూ పళనిస్వామని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రాష్ట్రం, మరోవైపు ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. ఎంజీఆర్(MGR), అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమన్నారు. అయితే శశికళ చర్యల్ని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తు చేశారు. అటువంటప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను తాను ప్రకటించుకోవడమంటే కోర్టు ధిక్కరణ చేసినట్టేనని చెప్పారు. చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Also read: Asian Paints Apcolite All Protek: అప్‌కోలైట్ ఆల్ ప్రొటెక్ - అందమైన మీ గోడలకు ఆల్-రౌండ్ ప్రొటెక్షన్ కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News