Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కొనసాగవచ్చని సమాచారం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కళింగపట్నం వద్ద తీరం దాటింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో తూర్పు ఆంధ్ర మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిస్సా తీరాల మధ్య కేంద్రీకృత మై ఉంది. వాయుగుండం ఇవాళ సెప్టెంబర్ 1వ తేదీన తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉత్తర ఆంధ్ర తీరం సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం కళింగ పట్నానికి పశ్చిమ దిశలో సుమారు 70 కి.మీ, విశాఖపట్నంకు ఉత్తర, వాయువ్య దిశలో సుమారు 80 కి.మీ , ఒడిస్సాలోని గోపల్పూర్కు నైరుతి దిశ లో 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ వాయుగుండం రాగల 24 గంటలలో వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఆంధ్ర దాని సమీపంలోని దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గడ్, తెలంగాణ మీదుగా కదిలే అవకాశం ఉంది.
వాయుగుండం కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీళ్లు చేరడంతో రాకపోకలు స్థంబించాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఖమ్మంలో చెరువు బజార్, కవిరాజ్ నగర్, జడ్పీ సెంటర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది.
Also read: Telangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.