iPhone Tapping: దేశ రాజకీయాల్లో ఆపిల్ సంస్థ కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన వ్యక్తులకు ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన మెయిల్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో ఇండియాలోని ప్రతిపక్ష నేతల పేర్లున్నాయి. ఇదే ఇప్పుడు కలకలం కల్గిస్తోంది. ఫోన్లు హ్యాక్ అయ్యాయంటూ సాక్షాత్తూ ఆపిల్ సంస్థే మెయిల్ చేయడం ఇందుకు కారణం.
దేశంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగుతోంది. ఏ మాత్రం హ్యాకింగ్‌కు ఆస్కారం లేని ఆపిల్ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ సాక్షాత్తూ ఆపిల్ సంస్థే స్పష్టం చేయడం దేశంలో ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొందరిని టార్గెట్ చేసి ఈ హ్యాకింగ్ జరుగుతోందని ఆపిల్ తెలిపింది. మీ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ ఆపిల్ సంస్థే నేరుగా తమ యూజర్లకు మెయిల్ పంపింది. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు మీ ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అలర్ట్ మెస్సేజ్ పంపింది. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు అంటే కచ్చితంగా ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీలేనని తెలుస్తోంది. ఆపిల్ ఫోన్ ఐడీల్ని రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోందనేది ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన మెయిల్ సారాంశం.
ఆపిల్ సంస్థ నుంచి అలర్ట్ మెయిల్ అందుకున్నవారిలో ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, శశిధరూర్, రాఘవ్ ఛడ్డా, మహువా మొయిత్రి, కేసీ వేణుగోపాల్, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్, ప్రియాంక చతుర్వేది ఇలా లిస్ట్ పెద్దదే ఉంది. ఈ ఘటనతో దేశంలో పెద్దఎత్తున దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీ, ఒవైసీ తదితరులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook