Assam Floods: అస్సోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పోటెత్తుతున్న వరద కారణంగా 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.
అస్సోంలో వరద పోటెత్తుతోంది. వరదల కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. తాగునీరు, ఆహారం లేక జనం అల్లాడుతున్నారు. అస్సోంలో వరద ప్రభావం 222 గ్రామాలపై స్పష్టంగా కన్పిస్తోంది. మరోవైపు 57 వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇక 1434 పశువులు గల్లంతయ్యాయి. డబుల్ డిజిట్‌లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అస్సోం మెరుపు వరదల కారణంగా రాష్ట్రంలో 15 రెవిన్యూ ప్రాంతాల్లో ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పది వేలకు పైగా హెక్టార్లలో పంటభూమి నాశనమైంది. వేలాది హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా దీమా హసావ్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ ముగ్గురు మరణించారు. 2 వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. హాఫ్‌లాంగ్ ప్రాంతంలో వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి.
వరదల్లో చిక్కుకుపోయిన రైళ్లు
భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైలు సర్వీసుల్ని రూట్ మార్చింది. మరోవైపు రెండు రైళ్లు వరదల కారణంగా మధ్యలో చిక్కుకుపోయాయి. ఇందులో 14 వందలమంది ప్రయాణీకులున్నారు. ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అస్సాం రైఫిల్స్, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. డిటోక్ చెర్రా రైల్వే స్టేషన్‌లో 1245 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. వీరందరినీ బదర్‌పూర్, సిల్చార్ రైల్వే స్టేషన్లకు తరలించారు. మరో 119 మంది పాసెంజర్లను సిల్చార్‌కు ఎయిర్ లిఫ్ట్ చేశారు.
The Indian Air Force rescued 119 passengers of the Silchar-Guwahati Express after the train was left stranded due to heavy rain in the Cachar area. Assam has been ravaged by flash floods and massive landslides at several places, snapping rail and road links from other parts. pic.twitter.com/2xZwwa3EOY
— Narayan (@NarayanIndia1) May 16, 2022
ఆర్మీ, పారా మిలిటరీ దళాలు, ఎస్డీఆర్ఎప్, అగ్నిమాపక దళాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. వరదల కారణంగా హోజాయ్, లఖీమ్‌పూర్, నాగావ్ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు , ఇరిగేషన్ కాలువలు దెబ్బతిన్నాయి. భారీగా కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి.
Also read: Cyber Crimes Alert: ఆ లింక్‌లు పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Assam Floods: అస్సోం వరదల్లో చిక్కుకున్న రెండు రైళ్లు, 14 వందల మంది ప్రయాణీకులు
అస్సోంలో భీభత్సం సృష్టిస్తున్న మెరుపు వరదలు
వరదల్లో చిక్కుకుపోయిన రెండు రైళ్లు, 14 వందల మంది ప్రయాణీకులు
రెండు రైల్వే స్టేషన్లలో చిక్కుకున్న 1245 మంది రైల్వే ప్రయాణీకులు