Covaxin Price: వ్యాక్సిన్ ధరల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం..ఇటు కంపెనీలు స్పష్టత ఇచ్చేశాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరల్లో తగ్గింపు లేదని స్పష్టమైంది. భారత్ బయోటెక్ కంపెనీ ఆ విషయంలో తేల్చిచెప్పేసింది.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సినేషన్(Vaccination) కార్యక్రమం కొనసాగుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, రష్యన్ కంపెనీ అభివృద్ధి చేసిన స్పుట్నిక్ వితో పాటు మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ మూడు వ్యాక్సిన్ల ప్రైవేటు ఆసుపత్రుల ధరను నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కొక్క డోసును 780 రూపాయలుగా, కోవాగ్జిన్ ఒక డోసును 1410 రూపాయలుగా, స్పుట్నిక్ వి వ్యాక్సిన్ (Sputnik v vaccine) ఒక డోసు ధరను 1145 రూపాయలుగా నిర్ధారించింది. జీఎస్టీ 5 శాతం, 150 రూపాయల సర్వీస్ ఛార్జ్ అదనమని చెప్పింది.
అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తగ్గించాలనే వాదన ప్రారంభమైంది. ఈ విషయంలో కోవాగ్జిన్ (Covaxin) ఉత్పత్తిదారైన భారత్ బయోటెక్ కంపెనీ (Bharat Biotech) స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల వ్యాక్సిన్ ధరను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదని తేల్చిచెప్పింది. నష్టాలు వస్తున్నా..ఇప్పటికే తక్కువ ధరకు కేంద్రానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం 150 రూపాయలకే అందిస్తున్నట్టు భారత్ బయోటెక్ (Bharat Biotech)వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ సరఫరా చేయలేమని తెలిపింది. తమ ఉత్పత్తిలో పది శాతం కంటే తక్కువే ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నామని..మిగిలిందంతా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రైవేటు రంగానికి వ్యాక్సిన్ ధరను మరింతగా తగ్గించలేమని తెలిపింది. నష్టాల్ని పూడ్చుకునేందుకే ప్రైవేటుకు ఈ ధరల్ని నిర్ధారించినట్టు కంపెనీ పేర్కొంది.
Also read: Kerala Fishermen Case: కేరళ జాలర్ల హత్యకేసు, ఇటలీ నావికులకు విముక్తి కల్పించిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook