Bihar Hooch Tragedy: మద్య నిషేధం అమలవుతున్న రాష్ట్రాల్లో కల్తీ మద్యం చావులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కల్తీ మద్యం కారణంగా గుజరాత్‌లో దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా బిహార్‌లోనూ కల్తీ మద్యం సేవించి 11 మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో చాలామంది తమ కంటిచూపును కోల్పోయారు. బీహార్‌లోని శరణ్ జిల్లా పుల్వారియా పంచాయతీ పరిధిలో ఈ కల్తీ మద్యం ఘటన చోటు చేసుకుంది.
శ్రావణ మాసం సందర్భంగా పుల్వారియా పంచాయతీ పరిధిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టు 3న నిర్వహించిన ఉత్సవాల సందర్బంగా సాంప్రదాయం ప్రకారం కొంతమంది మద్యం సేవించారు. అయితే అది కల్తీ మద్యం కావడంతో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైనవారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
బాధితుల్లో 9 మంది పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధికారుల రాకకు ముందే గ్రామంలో మరో కల్తీ మద్యం బాధితుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇప్పటివరకూ కల్తీ మద్యం కారణంగా మృతి చెందినవారి సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది.
కాగా, బీహార్‌లో 2016 నుంచి మద్య నిషేధం అమలవుతోంది. అయినప్పటికీ కల్తీ మద్యం చావులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకూ 50కి పైగా కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో గుజరాత్‌లోనూ కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బోతాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి దాదాపు 40 మంది మృతి చెందారు.
Also Read: Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం..తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ..!
Also Read: CM KCR LIVE UPDATES: అసెంబ్లీ రద్దా? జాతీయ పార్టీ ప్రకటనా? సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook