Agriculture acts: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. కొత్త చట్టాలు విప్లవాత్మకమైనవని..రైతులెవరూ ఇబ్బంది పడరని స్పష్టం చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాల్ని ( New farmer acts ) 30-40 ఏళ్ల క్రితమే తీసుకొచ్చి ఉంటే..రైతుల జీవితాలు బాగుపడేవని..జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నూతన చట్టాలపై సూచనలు వింటామని..కానీ వెనుకడుగేసే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవన్నారు. చట్టాలు రూపొందించేటప్పుడు మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్‌యార్డ్ వెలుపల అమ్ముకోవచ్చని..సెస్ కట్టాల్సిన అవసరం లేదన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా కనీస మద్దతు ధర ఉండదంటూ కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారాల్ని నమ్మవద్దన్నారు. రైతుల అపోహల్ని నివృత్తి చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పండించే రైతుతోనే ఒప్పందాలుంటాయని..రైతు భూమి సురక్షితమని బిల్లులో స్పష్టంగా ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( somu veerraju ) తెలిపారు.
Also read; PM kisan samman nidhi: మీ ఖాతాలో డబ్బులు చేరలేదా..ఇలా చేయండి చాలు