BJP State President JP Nadda Wifes Car Stolen From Service Centre: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీమణికారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 19 న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. జేపీనడ్డా టయాటా ఫార్చునర్ కారును ఆయన డ్రైవర్ సర్వీస్ కు ఇచ్చాడు. సర్వీసింగ్ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు ఆకలిగా అన్పించడంతో, ఒక హోటల్ వద్ద టయాటాను పార్క్ చేసి ఫుడ్ తినడానికి వెళ్లాడు. హోటల్ లో తీరిగ్గా తిని బయటకు వచ్చి చూసేసరికి పార్చూనర్ లేదు. చుట్టుపక్కల వారిని ఆరాతీశాడు. చేసేది లేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..
వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. అక్కడి ఉన్న ఒకు సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు ఫార్చునర్ ను చోరీ చేసి, గురుగ్రామ్ వైపుగా వెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. దొంగిలించడిన కారు హిమచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్నట్లు తెలుస్తోంది.ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడి కారును చోరీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై అపోసిషన్ లీటర్లు సెటైరికల్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.
తన సొంత కారును కాపాడుకోలేని బీజీపీ నేతలు, ప్రజలకు ఏం భద్రత ఇస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ ఘటన దేశంలో మరో హాట్ టాపిక్ మారింది.
Read More: Viral Video: షాకింగ్ లో మహిళ.. రీల్స్ చేస్తుండగా ఆ పనికానిచ్చిన ఆగంతకుడు.. వీడియో వైరల్..
ఇక.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన పాలన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి లోక్ సభలో ఎన్నికలలో ఎలాగైన బీజేపీ 400 కు పైగా సీట్లు గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక... మరోవైపు అపోసిషన్ లీటర్లు.. కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అపోసిషన్ నాయకులపై ఒత్తిడి చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook