captain Anshuman singh parents emotional her daughter in law behaviour: దేశం కోసం కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు అర్పించారు. సియాచీన్ ఆర్మీ బేస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తన తోటి వాళ్లను కాపాడేక్రమంలో ఆయన తన ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన ఏడాదికే ఆయన చనిపోవడం పట్ల ఆయన సతీమణి స్మృతి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఇటీవల స్మృతి తమ మధ్య ప్రేమ, పెళ్లి జరిగిన విధానంను ఒక మీడియాలో పంచుకున్నారు. కాలేజీలో చేరిన తొలిరోజే అన్షుమన్‌ను కలిశానని, తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని, 8 ఏళ్ల పాటు చాలా దూరం రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని స్మృతి తెలిపింది.
शहीद कैप्टन अंशुमान सिंह के माता-पिता का कहना है कि बेटा मेरा शहीद हुआ, लेकिन हमें कुछ न मिला… सबकुछ लेकर बहू चली गई जबकि शादी को सिर्फ़ 5 महीने हुए थे, न बेटा मिला न बहु… राहुल गांधी से इस मुद्दे पर अंशुमान के माता पिता से बात भी हुई है, राहुल ने रक्षा मंत्री से बात करूँगा.. pic.twitter.com/8IDKUk8TPR
— Pankaj Chaturvedi (@pankajjilive) July 11, 2024
అన్షుమాన్ సింగ్ చనిపోవడానికి ఒక రోజు ముందు, ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నామని, తమ ఫ్యూచర్ ప్లాన్ ఏవిధంగా ఉండాలో కూడా ఇద్దరం షేర్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ.. ఆ మరునాడే.. అన్షుమాన్ మరణవార్త వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. మొదట ఈ ఘటనను నిజమని నమ్మకాడనికి తన మనస్సు ఒప్పుకోలేదని, తాముమాట్లాడుకున్నమాటలు.. తన మనస్సులోనే ఉన్నాయని కూడా ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత వార్తలు రావడం,ఆ తర్వాత దేశం కోసం తన భర్త ప్రాణాత్యాగం చేయడం వార్తలు చూశానన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డు తీసుకున్నానని చెప్పింది.
ఇదిలా ఉండగా.. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అన్షుమాన్ తల్లిదండ్రులు ఇప్పుడు మరోవేదనకు గురయినట్లు తెలుస్తోంది. తమ కోడలు స్మృతి కీర్తి చక్రతో పాటు, దాని కింద వచ్చిన డబ్బులను కూడా తీసుకుని వెళ్లిపోయిందని కన్నీళ్లుపెట్టుకున్నారు. తమకు గోడ మీద తమ కొడుకు ఫోటో మాత్రమే మిగిలిందని మీడియాతో చెప్పుకుని బాధపడ్డారు. ఈ ఘటనపై.. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అన్షుమాన్ తల్లిదండ్రులు కలిసినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. తమ కోడుకు చనిపొవడం, మరోవైపు కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తమను కలచివేసిందన్నారు. ఈ వృద్ధాప్యం.. ఆసరాగా ఉంటాడనుకున్న తమ కొండంత కొడుకు చనిపోయాడని బాధపడ్డారు.
కేంద్రంలో.. అనుసరిస్తున్న.. NOK (నెక్స్ట్ ఆఫ్ కిన్)కి సంబంధించి భారత సైన్యం నిర్దేశించిన ప్రమాణాలు సరైనవి కావని అన్నారు. కేవలం..5 నెలల క్రితం వీరికి పెళ్లి జరిగింది. కనీసం పిల్లలు లేరని, తమకు తమ కొడుకు ఫోటో మాత్రమే మిగిలిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె (స్మృతి సింగ్) తన చిరునామాను కూడా మార్చుకుంటుందని, తమ దగ్గర ఏమిలేదని అన్నారు. వెంటనే NOK (నెక్స్ట్ ఆఫ్ కిన్) నిబంధనలలో మార్పులు రావాలని పేర్కొన్నారు.
1999 నాటి కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడుతూ, అప్పట్లో సైన్యంలో అమరులైన వారి కుటుంబాలకు.. ప్రభుత్వం కల్పించే ఏ సహాయంమైన.. 67-33% మార్పు వచ్చిందని, దానిని అమలు చేయాలని చెప్పారు.. చనిపోయిన వ్యక్తి.. భార్య కుటుంబంలో ఉంటే ఏమి జరుగుతుంది, పిల్లలు ఉంటే లేదా లేకపోతే ఏమి జరుగుతుంది, ఆమె వెళ్ళిపోతే ఏమవుతుంది. పాత సంప్రదాయాన్ని కొనసాగించవద్దని అన్షుమన్ తండ్రి ఆవేదన చెందారు. అన్షుమాన్ సింగ్ తల్లి 'కీర్తి చక్ర'కు సహ గ్రహీత అని, అయితే తన కుమారుడి విగ్రహానికి పెట్టడానికి ఆమె వద్ద ఆ చక్రం లేదని ఆయన అన్నారు.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
ఈ విషయమై రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని అన్షుమన్ సింగ్ తండ్రి తెలిపారు. వీరమరణం పొందిన సైనికుడి తల్లి మంజు సింగ్ మాట్లాడుతూ, కోడళ్లు ఏదైన జరిగితే ఇంట్లో నుంచి పారిపోతారు. కోడలు అత్తామామలను వదిలి పారిపోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. భవిష్యత్తులో ఏ తల్లితండ్రులు కూడా తమలా బాధపడకూడదని ఇప్పుడు తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకోచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి